Site icon NTV Telugu

Breakup : ఎట్టకేలకు స్పందించిన షణ్ముఖ్

Shanmukh

Shanmukh

షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ వీడియోలు, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్‌లతో పాపులర్ సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షణ్ముఖ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని తన అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. గత ఏడాది జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రన్నరప్‌గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ హౌస్ వెలుపల షణ్ముఖ్‌పై విపరీతమైన ప్రతికూలత ఏర్పడింది. దానికి ముఖ్యకారణం మరో కంటెస్టెంట్ సిరి హనుమంతుతో షన్ను రిలేషన్ అన్న విషయం తెలిసిందే.

Read Also : Sarkaru Vaari Paata : కళాశాలలో “కళావతి” మేనియా… వీడియో వైరల్

షో పూర్తయ్యే వరకు బాగానే ఉన్న షణ్ముఖ్ ప్రియురాలు సునైనా, ఆ తరువాత మాత్రం బ్రేకప్ చెప్పేసింది. వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ విషయంపై ఇప్పటిదాకా షన్ను స్పందించలేదని చెప్పాలి. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఓపెన్ అయ్యాడు. తన బ్రేకప్‌తో సిరికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. వారు ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నారట. అయితే బిగ్ బాస్ ద్వారా తనకు వచ్చిన విపరీతమైన ప్రతికూలతతో షన్ను కలత చెందాడట. దీప్తి కూడా ప్రతికూలతలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పాడు. సిరి విషయంలో తన రిలేషన్ గురించిన అంచనాలు తలక్రిందులయ్యాయని చెప్పుకొచ్చాడు. దీంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్యాచ్-అప్‌కు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అని అడిగినప్పుడు… అదంతా విధిపై ఆధారపడి ఉంటుందని షన్ను చెప్పాడు. తన విడిపోవడానికి సిరిని నిందించవద్దని ప్రజలను అభ్యర్థించాడు. తప్పు తనవైపే ఉందని ఒప్పుకున్నాడు.

Exit mobile version