Site icon NTV Telugu

Ram Charan: 100 మంది కాదు షేర్‌ఖాన్.. ఈసారి 1000 మందితో…

Ram Charan

Ram Charan

మగధీర సినిమా క్లైమాక్స్‌ను అంత ఈజీగా మరిచిపోలేం. సినిమా మొత్తం ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో ఎత్తు. రాజమౌళి యాక్షన్ టేకింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపించు.. అని చరణ్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొత్తంగా వంద మందిని చంపిన వీరుడిగా, మగధీరుడిగా అదరగొట్టేశాడు రామ్ చరణ్. అయితే ఈ సారి మాత్రం ఏకంగా వెయ్యి మందితో ఫైట్ చేయబోతున్నాడట మెగా పవర్ స్టార్. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉన్నప్పుడే ఆర్సీ 15ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు.. రీసెంట్‌గానే గ్లోబల్ రేంజ్‌లో ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ఇంకా కొన్ని రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. రేపో, మాపో ఓ భారీ షెడ్యూల్‌ని షూట్ చేయబోతున్నారు.

ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ షూట్ చేయబోతున్నారు. ఇక ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ఏకంగా వెయ్యి నుంచి 1200 మంది ఫైటర్స్‌ని రంగంలోకి దింపుతున్నాడట శంకర్. దీనికి కేజియఫ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ‘అన్బు అరివ్’ బ్రదర్స్ పని చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ ఫైట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ కూడా సిద్ధం చేశారు. ఈ ఫైట్‌లో రామ్ చరణ్‌తో పాటు విలన్‌గా నటిస్తున్న ఎస్‌జే సూర్య కూడా జాయిన్ అవబోతున్నట్టు తెలుస్తోంది. మగధీర సినిమాలో వంద మందితో ఫైట్ అంటేనే.. థియేటర్ టాపులు లేచిపోయాయి. అలాంటిది వెయ్యి మందితో చరణ్ ఫైట్ అంటే.. ఇంకే రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి వెయ్యి మందితో గేమ్ ఛేంజర్ ఎలాంటి ఫైట్ చేస్తాడో చూడాలి.

Exit mobile version