Site icon NTV Telugu

Siva Kandukuri: ‘మనుచరిత్ర’ హక్కులు ఎవరికంటే..?

Manu Charitra Movies Rights

Manu Charitra Movies Rights

Shankar Pictures Bought Manu Charitra Movie Rights: యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘మ‌ను చరిత్ర’. మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్లమాని కథానాయికలుగా నటిస్తున్నారు. భ‌ర‌త్ పెద‌గాని ఈ చిత్రంతో ద‌ర్శకునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో ఇంటెన్స్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. త్వరలోనే విడుదల తేది ప్రకటించనున్నారు నిర్మాతలు. ప్రొద్దుటూరు టాకీస్ బ్యాన‌ర్‌పై నరాల శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, రాహుల్ శ్రీ‌వాత్సవ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ప్రగ‌తి శ్రీ‌వాత్సవ్‌, సుహాస్‌, డాలి ధ‌నంజ‌య్‌, శ్రీ‌కాంత్‌ అయ్యంగార్‌, మ‌ధునంద‌న్‌, ర‌ఘు, దేవీప్రసాద్‌, ప్రమోదిని, సంజ‌య్ స్వరూప్‌, హ‌ర్షిత‌, గ‌రిమ‌, ల‌జ్జ శివ‌, క‌ర‌ణ్‌, గ‌డ్డం శివ‌, ప్రదీప్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి ‘చూసి చూడంగానే’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పాన్ ఇండియా మూవీ ‘గమనం’లోనూ హీరోగా నటించాడు. ‘మనుచరిత్ర’ అతని మూడో చిత్రం. శివ కందుకూరి నటిస్తున్న మరో రెండు మూడు సినిమాలు సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి.

Exit mobile version