Site icon NTV Telugu

శంకర్ కి ఝలక్ ఇచ్చిన చరణ్.. రెండు నెలలు షూటింగ్ క్యాన్సిల్

ram charan

ram charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైన్ అప్ మాములుగా లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ ని పూర్తి చేసుకొని శంకర్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. కొన్ని రోజులు షూటింగ్ మొదలు పెట్టిన శంకర్ కి చరణ్ ఝలక్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కారణంగా రెండు నెలలు షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. దీంతో శంకర్ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం చెర్రీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే.

https://ntvtelugu.com/rebel-star-krishnamraju-look-reveal-in-radheshyam/

ఇక ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. అప్పటివరకు చిత్ర బృందం ప్రమోషన్స్ చేస్తూనే ఉంటుంది కాబట్టి శంకర్ కొత్త షెడ్యూల్ ని ఫిబ్రవరికి మార్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు నెలలు శంకర్ సినిమా వాయిదా పడినట్లే.. శరవేగంగా శంకర్ సినిమాను పూర్తిచేద్దామనుకొంటే మధ్యలో ఈ ప్రమోషన్స్ వలన అది కాస్తా వాయిదా పడింది. మరి ఫిబ్రవరి నుంచి నిర్విరామంగా ఈ షూటింగ్ కొనసాగనుందని అంటున్నారు. ఇక త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలనీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. మరి ఆ ప్రయత్నాలు ఎక్కడివరకు సాగుతాయో చూడాలి.

Exit mobile version