NTV Telugu Site icon

Directors: హిట్ కోసం పరితపిస్తున్న డైరెక్టర్లు వీరే!

Shankar, Koratala Siva, Krish, Sujeeth Waiting for Sucess: సౌత్ లో సినిమా ట్రెండ్ మారింది. ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా సరే ముందు సినిమా హిట్ కొడితేనే ఆ దర్శకుకులకి ఛాన్స్ ఇస్తున్నారు బడా స్టార్స్. ప్రాజెక్ట్ మొదలు పెట్టేముందు అత‌డి ప్రీవియస్ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? అన్న పాయింట్ ని తెర పైకి తెస్తున్నారు. ఇదే ఇప్పుడు కొందరు బడా డైరెక్టర్ల కెరీర్ కి డేంజర్ గా మారింది. చేతిలో ఉన్న సినిమాలు కచ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారిలో మొదటి వారు శంకర్. రోబో తో బ్లాక్ బస్టర్ కొట్టిన శంక‌ర్ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. ‘ఐ ‘ప్లాప్ అవ్వ‌గా.. ‘2.0’ న‌ష్టాలు లేకుండా బ‌య‌ట‌ప‌డింది.దీంతో శంక‌ర్ మార్కెట్ ఒక్క‌సారిగా డౌన్ అయిపోయింది. దీంతో కోలీవుడ్ లో ఛాన్స్ ఇచ్చేందుకు బడా స్టార్స్ వెనకడుగు వేశారు. అందుకే టాలీవుడ్ కి వచ్చి మెగా పవర్ స్టార్ తో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్థితి.

Samantha Remuneration: వెబ్ సిరీస్ కోసం సమంత షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?

ఇక మరోపక్క మిర్చితో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొరటాల శివ…తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అకౌంట్ లో వేసుకున్నాడు. స్టార్ మేకర్ గా ఫోకస్ అయ్యాడు. అయితే చిరుతో చేసిన ఆచార్య తన వేగానికి బ్రేక్ వేసింది. మెగాస్టార్ ని పెట్టుకుని ప్లాప్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు గురి చేసింది. దీంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న కొరటాల ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న ఈ ప్రాజెక్ట్ కొరటాలీ కెరీర్ కి కీలకంగా మారింది. సినిమా హిట్ అయితేనే తన కెరీర్ ముందుకు సాగుతుంది.

ఇక అలాగే గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణి త‌ర్వాత సరైనా హిట్ లేక స్ట్రగూల్ అవుతున్నాడు డైరెక్టర్ క్రిష్. సౌత్ ,నార్త్ అని ఎన్ని చక్కర్లు కొట్టిన ఆశించిన ఫలితం దక్కలేదు. అయినా క్రిష్ టాలెంట్ నమ్మి హరిహర వీరమల్లుకి ఛాన్స్ ఇచ్చాడు పవన్. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ఈ ప్రాజెక్టు వచ్చే దసరాకి ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి క్రిష్ కెరీర్ డిసైడ్ అవుతుంది. అయితే ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకుకని అనుష్కతో ఒక సినిమా మొదలు పెట్టాడు ఆయన. ఇక అలాగే సాహో డిజాస్టర్ తర్వాత నాలుగేళ్లు ఖాళీగా ఉన్న సుజిత్ ఇప్పుడు పవన్ తో ఓజీ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా రిజల్ట్ కూడా తన కెరీర్ కి కీ పాయింట్ గా మారింది. మొత్తానికి ఈ నాలుగురు దర్శకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా విజయం సాధించాల్సిందే. లేదంటే హిట్ డైరెక్టర్స్ లిస్ట్ లో నుంచి వెనకబడిపోయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల అంచనా. చూడాలి మరి ఆ సినిమాలు వారికి ఎంతలా ఉపయోగపడతాయి అనేది.