Shambo Shiva Shambo Re Release: ‘ఫ్రెండ్‌షిప్ డే’ స్పెషల్‌గా 4Kలో ‘శంభో శివ శంభో’.. ట్రైలర్, రిలీజ్ డేట్ డీటెయిల్స్ ఇవే!

  • మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న శంభో శివ శంభో
  • 'ఫ్రెండ్‌షిప్ డే' స్పెషల్‌గా 4K క్వాలిటీ రిలీజ్
  • శనివారం సాయంత్రం 5:04 గంటలకు 4K ట్రైలర్‌
Shambo Shiva Shambo Re Release

Shambo Shiva Shambo Re Release

Shambo Shiva Shambo 4K Trailer Date: తెలుగు ప్రేక్షకులను నవ్వులు, భావోద్వేగాలతో అలరించిన మల్టీస్టారర్ చిత్రం ‘శంభో శివ శంభో’. 2010లో సంచలనం సృష్టించిన ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘ఫ్రెండ్‌షిప్ డే’ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని 4K క్వాలిటీలో ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

రీ-రిలీజ్‌కు ముందు అభిమానులకు చిత్రబృందం మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతుంది. శనివారం సాయంత్రం 5:04 గంటలకు శంభో శివ శంభో 4K ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ట్రైలర్‌ను ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేయనున్నారు. సినిమా టికెట్ బుకింగ్స్‌ను జూలై 25 నుంచి ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. రీ-రిలీజ్‌ను ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ప్లాన్ చేయడంతో ఈ క్లాసిక్ సినిమాను మళ్లీ పెద్ద తెరపై చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శంభో శివ శంభో మూవీ స్నేహం, భావోద్వేగాలు, కుటుంబ విలువలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అత్యాధునిక 4K విజువల్ క్వాలిటీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని అందించనుంది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా స్నేహితులతో కలిసి ఈ క్లాసిక్ సినిమాను మరోసారి ఆస్వాదించే అవకాశం దక్కనుండటంతో అభిమానులు ట్రైలర్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు విడుదల కానున్న ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ను తీసుకురానుంది.