Shambo Shiva Shambo Re Release: ‘ఫ్రెండ్షిప్ డే’ స్పెషల్‌గా 4Kలో ‘శంభో శివ శంభో’.. ట్రైలర్, రిలీజ్ డేట్ డీటెయిల్స్ ఇవే!
- మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న శంభో శివ శంభో
- 'ఫ్రెండ్షిప్ డే' స్పెషల్‌గా 4K క్వాలిటీ రిలీజ్
- శనివారం సాయంత్రం 5:04 గంటలకు 4K ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shambo Shiva Shambo 4K Trailer Date: తెలుగు ప్రేక్షకులను నవ్వులు, భావోద్వేగాలతో అలరించిన మల్టీస్టారర్ చిత్రం ‘శంభో శివ శంభో’. 2010లో సంచలనం సృష్టించిన ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘ఫ్రెండ్షిప్ డే’ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని 4K క్వాలిటీలో ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
రీ-రిలీజ్‌కు ముందు అభిమానులకు చిత్రబృందం మరో సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. శనివారం సాయంత్రం 5:04 గంటలకు శంభో శివ శంభో 4K ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ట్రైలర్‌ను ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేయనున్నారు. సినిమా టికెట్ బుకింగ్స్‌ను జూలై 25 నుంచి ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. రీ-రిలీజ్‌ను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్లాన్ చేయడంతో ఈ క్లాసిక్ సినిమాను మళ్లీ పెద్ద తెరపై చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
శంభో శివ శంభో మూవీ స్నేహం, భావోద్వేగాలు, కుటుంబ విలువలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అత్యాధునిక 4K విజువల్ క్వాలిటీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని అందించనుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహితులతో కలిసి ఈ క్లాసిక్ సినిమాను మరోసారి ఆస్వాదించే అవకాశం దక్కనుండటంతో అభిమానులు ట్రైలర్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు విడుదల కానున్న ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ను తీసుకురానుంది.
Re releasing trailer tomorrow at 5.04pm ❤️🔥❤️🔥
On @adityamusic youtube channel#shamboshivashambo4kRe releasing on AUG 1ST 🔥🔥
Bookings open on JULY 25TH ❤️#friendshipdayspecial 🫂 pic.twitter.com/RVMlPJhXrz
— Shambho Shiva Shambho 4k (@SSSmovie4k) July 23, 2026
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!