NTV Telugu Site icon

Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమాపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Shalini

Shalini

Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఆ మూవీ తర్వాత బోల్డ్ సినిమాలు టాలీవుడ్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఇంత బోల్డ్ గా, వైల్డ్ గా తీస్తే జనాలు ఆదరిస్తారా.. ఎలా ఉంటుందో అనే అపోహలన్నీ చెరిపేసింది ఈ మూవీ. యూత్ ను ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ మూవీపై ఇందులో హీరోయిన్ గా చేసిన షాలినీ పాండే షాకింగ్ కామెంట్స్ చేసింది. షాలినీ పాండే అర్జున్ రెడ్డిలో ఎంత బోల్డ్ గా నటించిందో మనకు తెలిసిందే. తాజాగా ఆమె బాలీవుడ్ లో తెరకెక్కిన డబ్బావాలా కార్టెల్ సిరీస్ లో బలమైన మహిళ పాత్రలో నటించింది.

Read Also : Priyanka Gandhi: కుంభమేళాపై విపక్షాలకు మాట్లాడే అవకాశమివ్వాలి

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలో మళ్లీ నటిస్తారా అని యాంకర్ ప్రశ్నించారు. దానికి ఆమె సమాధానం ఇస్తూ.. అది నా కెరీర్ స్టార్టింగ్ లో వచ్చింది. అందులో నా పాత్ర కొంచెం బలహీనంగా ఉంటుంది. మరోసారి అలాంటి మూవీ ఛాన్స్ వస్తే కచ్చితంగా నటిస్తాను. కాకపోతే డైరెక్టర్ తో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది షాలినీ పాండే. సినిమాల్లో బలమైన పాత్రలు చేయాలని ఉందని.. అలాంటి కోరిక డబ్బావాలా కార్టెల్ సిరీస్ తో తీరిపోయిందని తెలిపింది షాలినీ.