NTV Telugu Site icon

Shalini Pandey: ప్రీతి.. ఏంటి ఈ అరాచకం.. అర్జున్ రెడ్డి ఏమైపోవాలి

Shalini

Shalini

Shalini Pandey: ప్రీతి.. అర్జున్ రెడ్డి జంట గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఒక్క సినిమా .. ఒకే ఒక్క సినిమా ఇండస్ట్రీ తీరుతెన్నులనే మార్చేసింది. అదే అర్జున్ రెడ్డి. ఒక అందమైన ప్రేమకథను కొద్దిగా వైలెంట్ గా చూపించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోయారు. అప్పట్లో వీరి ఒరిజినల్ నేమ్స్ కన్నా.. అర్జున్ రెడ్డి, ప్రీతి అనే పేర్లే ఎక్కువ మారుమ్రోగిపోయాయి. ఇక ఈ సినిమా ఇద్దరి కెరీర్ లను మార్చేస్తుంది అనుకున్నారు. అయితే అనుకున్నట్లుగానే విజయ్ లైఫ్ మారిపోయింది కానీ, షాలినిది మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. అర్జున్ రెడ్డి తరువాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది కానీ, అంతగా విజయాలను దక్కించుకోలేదు. ఆ తరువాత ఈ చిన్నది బరువు తగ్గి.. బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ అడపాదడపా కనిపించిందే తప్ప.. అంతగా ఏం విజయాలను అందుకోలేదు.

Rajinikanth: చంద్రముఖి 2.. ఏ యాంగిల్ లో నచ్చింది తలైవా నీకు.. ?

ఇక అమ్మడు సినిమా అవకాశాలు పక్కన పెడితే .. సోషల్ మీడియాలో ఈ భామ చేసే రచ్చ అంతఇంతా కాదు. బికినీ దగ్గరనుంచి ఏ ఫ్యాషన్ ట్రెండ్ లో ఉంటే ఆ డ్రెస్ లో అదరగొడుతూ.. కాదు.. కాదు అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా షాలిని.. బికినీ పిక్ తో ఇన్స్టాగ్రామ్ ను హీటెక్కించింది. స్విమ్మింగ్ చేసి వచ్చి.. అలా చైర్ లో కూర్చొని బుక్ చదువుతూ రిలాక్స్ మోడ్ లో కనిపించింది. ఇక బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా కూడా అమ్మడి టోన్డ్ బాడీ, ఆ అందాల ఆరబోత వేరే లేవెల్ అని చెప్పాలి. ఇక అమ్మడు ఎన్ని సినిమాలు తీసినా.. ఏ ఇండస్ట్రీకి వెళ్లినా తెలుగువారికి మాత్రం ఈ భామ ప్రీతినే.. అర్జున్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ నే. అందుకే ఈ ఫొటోకు వారు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ప్రీతి.. ఏంటి ఈ అరాచకం.. అర్జున్ రెడ్డి ఏమైపోవాలి అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

Show comments