Site icon NTV Telugu

Shankar: జనసేన కోసం అంత చేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? షకలక శంకర్ షాకింగ్ కామెంట్స్

Shakalaka Shankar

Shakalaka Shankar

Shakalaka Shankar Shocking Comments on Janasena: పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినప్పటి నుండి కమెడియన్ షకలక శంకర్ ఆ పార్టీకి పనిచేస్తూ వచ్చారు. అయితే తాజాగా అదే పార్టీ మీద షకలక శంకర్ చేసిన కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని వేల మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారిలో షకలక శంకర్ కూడా ఒకరు. నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చిన ఆయన జబర్దస్త్ ద్వారా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఏకంగా సినిమా హీరో స్థాయికి ఎదిగారు. ఈ మధ్యనే గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాతో మరోసారి మెరిసారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన జనసేన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Bangalore Rave Party: టాలీవుడ్ రేవులో ‘రేవ్ రింబోలా’.. ఇప్పుడేం చెబుతారు?

2019 ఎన్నికల్లో తాను సొంత ఖర్చులతో జనసేన కోసం ప్రచారం చేశానని అన్నాడు. మూడు లక్షలతో భోజనాలు పెట్టించాను, నేను ఎక్కడికి వెళ్ళినా జనసేన కుర్రాళ్ళు దీనంగా చూసేవాళ్ళు. వాళ్ళని అలా చూస్తే నాకు బాదేసి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేసే వాడిని దీంతో డబ్బు అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పుడు అడ్వాన్స్ లు వచ్చాయని ఇంట్లో చెప్పా, నేను ఏదో డబ్బులు తెస్తున్నాను అని అందరూ అనుకున్నారు. కానీ డీజిల్ కి కూడా డబ్బులు లేక మా ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి ఇంటికి వెళ్ళాను. డబ్బులు అంతా ఖర్చు చేశాను అని తెలిసి మా ఆవిడ నాలుగు రోజులు మాట్లాడలేదు.

మా మామయ్య కూడా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఇంత చేసావు కదా ఆయన కనీసం నీకు ఫోన్ చేశాడా? ఫోన్ సంగతి సరే అసలు ఆయన నీకు తిరిగి ఏం చేశాడు అని అడిగాడు. అప్పుడు నేను ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది. నేనెక్కడో ఏదో చేస్తే ఆయనకు తెలియాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ తెలిసి కూడా ఉండొచ్చు. కానీ ఆయన నుంచి నాకు ఎలాంటి ఫోన్ రాలేదు. అయినా నేనేమీ ఇదేదీ ఆశించి చేయలేదు. కనీసం ఆయనతో సినిమా చేసినప్పుడు కూడా ఒక ఫోటో కూడా ఆశించలేదు. మొన్న కూడా వారం రోజుల ప్రచారం చేశాను. అయితే ఈసారి నా దగ్గర ముందుండే డబ్బులు లేవని చెప్పాను కాబట్టి డీజిల్ ఫుడ్డు బెడ్డు మొత్తం వాళ్లే చూసుకున్నారు. కేవలం ప్రచారం చేశాను దానికి నేనేమీ అడగలేదు, వాళ్ళు ఏమి ఇవ్వలేదు అని ఆయన చెప్పుకొచ్చారు.

Exit mobile version