NTV Telugu Site icon

Shahrukh Khan: సల్మాన్ తర్వాత షారుఖ్.. భారీగా భద్రత పెంపు!

Shahrukh Khan Karma

Shahrukh Khan Karma

Shahrukh Khan Security Increased After Firing At Salman Khan House: ముంబైలోని బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి (గెలాక్సీ అపార్ట్‌మెంట్) వెలుపల కాల్పుల ఘటన తర్వాత, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ భద్రతను పెంచారు. పోలీసు రక్షణలో ఉన్న ఎస్‌ఆర్‌కెతో సహా స్టార్‌లందరినీ సమీక్షించామని, ఆ రక్షణనను మరింత కఠినతరం చేసే ప్రక్రియను ప్రారంభించామని ముంబై పోలీసులకు సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మొదటి చర్యలు షారుఖ్ ఖాన్ విషయంలో తీసుకున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నుండి వై ప్లస్ భద్రతలో షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఇక సల్మాన్ ఇంటిపై దాడి తర్వాత, 6 సాయుధ సైనికులతో 24 గంటలు ఉండేలా షారుక్ ఖాన్ భద్రతను మరింత పెంచారు. షారుఖ్ ఖాన్ ముంబైలో ఉన్నా లేదా బయట ఉన్నా.. ఆయన్ని ఎల్లవేళలా సెక్యూరిటీ కవర్‌లో ఉంచాలని ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల కోల్‌కతాలో మ్యాచ్ ముగిసిన తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య షారుక్ కనిపించారు.

Gehana Vasisth: అలాంటి సినిమాలు చెయ్యట్లే, పిలవకండి.. పోర్న్ రాకెట్ నటి సంచలనం!

2014లో ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా విడుదల సందర్భంగా డాన్ రవి పూజారి నుంచి షారుక్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ముప్పును సీరియస్‌గా తీసుకున్న అప్పటి ప్రభుత్వం షారుక్ ఖాన్‌కు భద్రతను పెంచింది. ఇక ఆయనకు Y ప్లస్ భద్రతను ఇచ్చింది. ఇక షారుక్ నటించిన ‘పఠాన్’ మరియు ‘జవాన్’ చిత్రాలు గత సంవత్సరం విడుదలయ్యాయి, ఆ సమయంలో కూడా కింగ్ ఖాన్‌కు అండర్ వరల్డ్ నుండి బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు బైక్ రైడర్లు సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపినప్పుడు, ఇంటి వెలుపల మోహరించిన పోలీసు వ్యాన్ అక్కడ నుండి కనిపించకుండా పోయిందని వర్గాలు చెబుతున్నాయి. ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకున్న నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్ కాల్పులకు పాల్పడ్డారని అంటున్నారు.