NTV Telugu Site icon

Yash Raj Films: జనవరి 25న షారుక్ ఖాన్ ‘పఠాన్’!

Pathaan

Pathaan

 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన తొలి హిందీ చిత్రం ‘దీవానా’ విడుదలై ఇవాళ్టితో 30 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ షారుక్ ఖాన్ తో తాను నిర్మిస్తున్న ‘పఠాన్’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. వెండితెర నటుడిగా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న షారుక్ ను అభినందిస్తూ, తమ ‘పఠాన్’ను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చే యేడాది జనవరి 25 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తెలిపింది. దీపికా పదుకునే నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడు. జాన్ అబ్రహం ఓ కీలక పాత్రను పోషించాడు. అలనాటి నాయిక డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని యశ్ రాజ్ సంస్థ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో నిర్మిస్తోంది. షారుక్ సినీ జీవితం 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు అతన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు.