Jawan: ఒకే ఏడాది రెండు సార్లు వంద కోట్ల ఓపెనింగ్ రాబట్టిన ఏకైక హీరో షారుఖ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదేళ్లుగా షారుక్ ఖాన్ కి హిట్ అనేదే తెలియదు… గత అయిదేళ్లుగా అయితే సినిమానే చేయలేదు. ఇలాంటి సమయంలో షారుఖ్ ఫ్లాప్స్ కి భయపడుతున్నాడు, షారుఖ్ ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు యంగ్ హీరోలని చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు, షారుఖ్ ఇక సినిమాలు చేయడు అనే మాట వినిపించడం మొదలయ్యాయి. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న షారుఖ్ ఖాన్ కి ఇవేమి పట్టలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు… సరిగ్గా అయిదేళ్ల విరామం తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల కంబ్యాక్ ఇచ్చాడు. షారుఖ్ కి మాత్రమే సాధ్యమైన కంబ్యాక్ ఇది. పఠాన్ సినిమా షారుఖ్ నే కాదు బాలీవుడ్ ని కూడా బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది.
పఠాన్ రాబట్టిన కలెక్షన్స్ దెబ్బకి షారుఖ్ పై కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కామెంట్స్ చేసిన వాళ్లని ఏకంగా అండర్ గ్రౌండ్ పంపించడానికి షారుఖ్ ‘జవాన్’ సినిమాతో కింగ్ సైజ్ ఎంట్రీ ఇచ్చాడు. అట్లీ సౌత్ టచ్ ఇచ్చి చేసిన జవాన్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇండియా నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో జవాన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అనిపించే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది. రిలీజ్ కి ముందే భారీ హైప్ మైంటైన్ చేసిన జవాన్ సినిమా మొదటి రోజు 120 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు సమాచారం. దీంతో ఒకే ఏడాదిలో రెండు సార్లు వంద కోట్ల ఓపెనింగ్ రాబట్టిన హీరోగా షారుఖ్ హిస్టరీ క్రియేట్ చేసాడు. లాంగ్ వీకెండ్ ఉంది, తర్వాత వినాయక చవితి ఫెస్టివల్ కూడా కలిసి వస్తుంది కాబట్టి జవాన్ సినిమా లాంగ్ రన్ లో పఠాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేయనుంది.
Also Read
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!