Shah Rukh Khan’s security has been upgraded to Y-plus category : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ అనే రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచి రూ.1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. దీంతో ఒక్క ఏడాదిలో రెండు వేల కోట్లు వసూలు చేసిన సినిమాలను అందించిన ఏకైక హీరోగా రికార్డుకు షారూక్ ఖాన్ తన పేరిట నమోదు చేసుకున్నారు. జవాన్, పఠాన్ సినిమాల విజయాల తర్వాత షారూఖ్ ఖాన్ డుంకీ అనే సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మరోవైపు నటుడు షారుఖ్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా సంస్థలు అప్రమత్తం చేయడంతో ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు షారుక్ ఖాన్ భద్రతను వై ప్లస్ కేటగిరీకి పెంచారు.
Meenakshi Chaudhary: అమాంతం రేటు పెంచేసిన మీనాక్షి.. మహేషా మజాకా?
ఇక వై ప్లస్ కేటగిరీలో ఉంది వ్యక్తులకు అంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్‌కు ఎల్లప్పుడూ ఆరుగురు తుపాకీలతో కూడిన పోలీసు కమాండోలు రక్షణగా ఉంటారని సమాచారం. భారతదేశం అంతటా ఆయన ఎక్కడికి వెళ్లినా ఈ వై ప్లస్ రక్షణ ఆయనకు ఉంటుందని సమాచారం. ఇక ఆయనతో ఉన్న కమాండోలు కాకుండా, షారుఖ్ ఖాన్ నివాసం వద్ద కూడా ఎల్లప్పుడూ నలుగురు సాయుధ పోలీసులు కాపలా ఉంటారు. షారుఖ్ ఖాన్‌కు అందించిన వై ప్లస్ భద్రత కోసం పని చేసే కమాండోలు MP-5 మెషిన్ గన్‌లు, AK-47 అసాల్ట్ రైఫిల్స్ సహా గ్లోక్ పిస్టల్స్‌ను కలిగి ఉండి వాటిని వాడడంలో ఆరితేరిన వారు అయి ఉంటారని అంటున్నారు. షారుఖ్‌కు ప్రాణహాని పెరిగిందని ఇంటెలిజెన్స్ అప్రమత్తం కావడంతో షారుఖ్ ఖాన్‌కు భద్రత కల్పిస్తున్నట్లు వీఐపీ సెక్యూరిటీ స్పెషల్ ఐజీ దిలీప్ సావంత్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం విధానాల ప్రకారం ప్రాణాలకు ముప్పు ఉన్న పౌరులకు Y+ భద్రత అందించబడుతుంది. ఈ రక్షణ పొందేందుకు తగిన రుసుము చెల్లించాలి లేదా సెక్యూరిటీ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి.