బాలీవుడ్ క్వీన్ అలియా భట్, గ్లామరస్ బ్యూటీ శార్వరీ వాఘ్ కాంబోలో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆల్ఫా’ గురించి ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శివ్ రావేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దేశంలోనే మొదటి ఫీమేల్ స్పై యాక్షన్ యూనివర్స్ మూవీగా రాబోతుంది. ఈ సినిమాలో అలియా – శార్వరీ ఇద్దరూ రహస్య గూఢచారిణులుగా కనిపించబోతున్నారని టాక్.
Also Read : Rashmika: నేను సరైన సమయంలో ఎంచుకున్న సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’
ఇక, షారుక్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారన్న వార్తలు బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం నిర్మాత ఆదిత్య చోప్రా స్వయంగా షారుక్‌ను సంప్రదించి, ఆయన ‘పఠాన్’ తరహా గూఢచారి పాత్రలో ‘ఆల్ఫా’లో కనిపించమని అభ్యర్థించారట. దీనికి కింగ్ ఖాన్ సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంటే యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లోని హీరోలు – హీరోయిన్లు కలిసే దశ దగ్గరగా ఉందన్నమాట..!
అలియా – శార్వరీ యాక్షన్ ట్రైనింగ్ కోసం ఇప్పటికే నెలల తరబడి స్పెషల్ వర్క్‌షాప్స్ చేశారు. ప్రపంచస్థాయి లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ లాంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. “ప్రతి దేశం ఒక అరణ్యమే.. దాన్ని పాలించడానికి వస్తున్నారు ‘ఆల్ఫా’ గర్ల్స్” అంటూ అలియా చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ను మరింత ఉత్కంఠకు గురి చేస్తోంది. సమాజంలో మహిళల శక్తి, ధైర్యం, నాయకత్వం మీద ఆధారంగా సాగే ఈ సినిమా 2025 చివర్లో విడుదల కానుంది. షారుక్ రోల్ లెంగ్త్ చిన్నదైనా, అది సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అభిమానులంతా ఇప్పుడు ఒకే ప్రశ్నతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు “పఠాన్ మళ్ళీ యాక్షన్‌లోకి వస్తున్నాడా?”
