Site icon NTV Telugu

Not Ramaiya Vastavaiya: ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ అంటూ రచ్చ రేపిన షారుఖ్ ఖాన్

Shahrukh Khan

Shahrukh Khan

Shah Rukh Khans Jawan Not Ramaiya Vastavaiya song OUT NOW: కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘జవాన్’ హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో సెప్టెంబర్ 7న రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే ఒక రేంజ్ లో అంచనాలు ఉన్న ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేలా ఈ సినిమా నుంచి మంగళవారం ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్ గా #AskSRK సెషన్ లో షారూఖ్ తన అభిమానులతో మాట్లాడుతూ ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ గ్లింప్స్ ను విడుదల చేసి ఆశ్చర్యంలో ముంచెత్తగా ఈ మూడో సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెర దించుతూ’నాట్ రామయ్యా వస్తావయ్యా..’ సాంగ్ విడుదల చేశారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు ‘నాట్ వస్తావయ్యా’ను అద్భుతంగా తెరకెక్కించినట్టు అనిపిస్తోంది, ఈ పాట చూస్తుంటే పార్టీ నెంబర్ లా ఉంది.

Vijay Devarakonda: ఆహా.. కొండన్న చేతిలో చెయ్యేసింది ఆమెనే.. ?

ప్రోమోలో షారూఖ్ ఎనర్జీ, ఛార్మ్ అందరినీ ఆకట్టుకోగా సాంగ్ లో అది రెట్టింపుగా కనిపిస్తుంది. డాన్స్ మూవ్స్ ట్రెండ్ సెట్టింగ్ గా ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ పాటను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మేకర్స్ విడుదల చేయగా అన్ని లాంగ్వేజస్ లో ఈ సాంగ్ పార్టీ వైబ్స్ తో అలరిస్తుంది. ఇక హిందీ వెర్షన్ లో ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ పాటకు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించగా కుమార్ సాహిత్యాన్ని అందించారు. అనిరుద్, విశాల్ దాడ్లాని, శిల్పా రావు పాటను తమదైన స్టైల్లో అద్భుతంగా ఆలపించారు. వైభవీ మర్చంట్ పాటకు కొరియోగ్రఫీ అందించడం గమనార్హం. తెలుగు వెర్షన్ పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయగా శ్రీరామచంద్ర, రక్షిత సురేష్, అనిరుద్ పాడారు అదే సమయంలో తమిళ వెర్షన్ సాంగ్ కు వివేక్ సాహిత్యాన్ని అందించారు. అనిరుద్, శ్రీరామ్ చంద్ర, రక్షిత సురేష్ పాటను పాడారు. షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

Exit mobile version