NTV Telugu Site icon

Mahesh babu: జవాన్ కోసం ఆగలేకున్నానంటూ మహేష్ ట్వీట్.. కలిసి చూద్దామన్నా షారుఖ్

Shah Rukh Khan Mahesh Babu

Shah Rukh Khan Mahesh Babu

Shah Rukh Khan Wants to Watch Jawan movie with mahesh babu: పఠాన్ తో బాలీవుడ్ రికార్డులు అన్నీ తిరగరాసిన షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న జవాన్‌ రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలే మిగులుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కగా ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ కానుంది. ను రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్‌ నిర్మించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతివిలన్ నాయకుడి పాత్ర పోషించాడు. ఇక ట్రైలర్ కట్ సూపర్ గా ఉండడంతో టిక్కెట్‌లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సౌత్‌లోనూ ఈ సినిమా క్రేజ్‌ ఒక రేంజ్ లో ఉంది.

Divya Spandana: నిద్ర పోతున్న ‘దివ్య స్పందన’.. లేపి మరణ వార్త చెప్పడంతో షాక్.. అసలు ఏమైందంటే?

ఒకప్పుడు హిందీ సినిమాలు అంటే హైదరాబాద్‌ వరకు బాగానే ఆడేవి. కానీ ఈ జవాన్ కి ఏపీలో కూడా పలు సిటీలలో బుకింగ్స్‌ వేరే రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం కేవలం సాధారణ సినీ ప్రియులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదే విషయాన్ని మహేష్ ట్విటర్‌లో వెల్లడించారు. ‘ జవాన్ టైమ్‌ వచ్చేసింది, షారుక్ ఖాన్ పవర్ మొత్తం సిల్వర్ స్క్రీన్ మీద కనబడబోతుంది, ఈ సినిమా అన్ని మార్కెట్లలోనూ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ’ మహేష్ వేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్వీట్‌పై షారుఖ్ ఖాన్‌ స్పందింస్తూ ‘మీరు సినిమాను ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా, మీరు ఎప్పుడు సినిమాకు వెళ్తారో చెప్పండి మీతో పాటు కలిసి సినిమా చూస్తానంటూ’ షారుఖ్‌ దానికి ట్వీట్ చేశాడు.

Show comments