Site icon NTV Telugu

Shah Rukh Khan: జవాన్‌ కోసం షారుఖ్ కొత్త అవతారం.. ఈసారి అంతకు మించి అనేలా!

Shah Rukh Khan Dance

Shah Rukh Khan Dance

Shah Rukh Khan Dance: షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై అంచనాలు పెంచేసిన క్రమంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన ట్రైలర్‌లో షారుక్ ఖాన్ జుట్టు లేకుండా కనిపిస్తున్న లుక్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ లుక్‌లో షారూఖ్ మెట్రోలో బెకరార్ కర్కే అనే పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించదు. ట్రైలర్‌లో షారుక్ డ్యాన్స్ క్లిప్ వైరల్ అవుతోంది. అయితే తాజాగా షారుక్ చేసిన ఈ డ్యాన్స్‌కి ఎవరు కొరియోగ్రఫీ చేశారనేది ఇప్పుడు వెల్లడైంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సీన్ మెట్రోను హైజాక్ చేసేలా ఉందనిపిస్తోంది. దీంతో కొందరు ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్న క్రమంలో షారుక్ ఖాన్ హఠాత్తుగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇక ఆయన డాన్స్ చేసిన ఈ పాట 1962 బిస్ సాల్ బాద్ చిత్రంలోనిదని అంటున్నారు.

Thirupathi Train: పట్టాలు తప్పిన తిరుపతి-తిరువనంతపురం రైలు.. తప్పిన ప్రమాదం

ఇక తాజాగా బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని మేరకు ఈ డ్యాన్స్ స్టెప్పులను షారుక్ ఖాన్ స్వయంగా కొరియోగ్రఫీ చేశారు. షారుఖ్ ఖాన్ చేసిన ఈ డాన్స్ మూమెంట్స్ నచ్చడంతో అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేసి పారేస్తున్నారు. షారుక్ ఖాన్ ఇటీవల ట్విట్టర్ ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌లో ఈ పాట ఆలోచన దర్శకుడు అట్లీదేనని చెప్పారు. ఇక జవాన్ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, సునీల్ గ్రోవర్, ప్రియమణి, సన్యా మల్హోత్రా షారుక్ ఖాన్‌తో పాటు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్ మరియు ఔరంగాబాద్‌లలో జరిగింది. ఈ సినిమాలో షారుక్ 6 డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడని అంటున్నారు. జవాన్‌ను ముందుగా జూన్‌లో విడుదల చేయాలని అనుకున్నా మేకర్స్ విడుదలను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు.

Exit mobile version