Site icon NTV Telugu

Shah Rukh Khan : ‘పఠాన్’ ఆన్ లొకేషన్ పిక్స్ లీక్

Bollywood King Khan Shah Rukh Khan Pathaan Movie Pics Viral.

బాలీవుడ్ లో రాబోయే సినిమాలలో పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో షారూఖ్ నటిస్తున్న ‘పఠాన్’ కూడా ఒకటి. ఇందులో షారుఖ్ లుక్‌ గతంలోనే విడుదలైంది. ప్రస్తుతం యూనిట్ స్పెయిన్‌లో షూటింగ్ జరుపుతోంది. షారూఖ్‌, దీపికా, జాన్ అబ్రహం ఈ షూటింగ్ పాల్గొంటున్నారు. ఆన్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ లీకై సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అందులో షారుఖ్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఒంటి మీద షర్ట్ లేకుండా, ఎయిట్ ప్యాక్ అబ్స్ తో పొడవైన జుట్టుతో ఉన్న షారూఖ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆసియాలో అత్యధిక సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో షారూఖ్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక 3 ఏళ్ళ తర్వాత ఈ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు షారూఖ్.

ఇందులో తన మేకోవర్‌ను డాక్యుమెంటరీగా విడుదల చేయబోతున్నాడట షారూఖ్. అభిమానులు దాని కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు సిద్ధార్థ్ ఆనంద్ స్పై థ్రిల్లర్, అట్లీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలు కమిట్ అయి ఉన్నాడు షారూఖ్. అట్లీ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, దీనికి ‘లయన్’ అనే టైటిల్ పెట్టనున్నారని సమాచారం. ఇక రాజ్‌కుమార్ హిరానీ సోషల్ కామెడీలో కూడా షారూఖ్ నటించనున్నాడు. ఇదిలా ఉంటే షారూఖ్ ఇటీవల తన కుమారుడి సమస్య వల్ల ఐదు నెలల పాటు మేకప్ కి దూరంగా ఉన్నాడు. మరి ‘పఠాన్’తో షారూఖ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Exit mobile version