Jawan: ప్రస్తుతం సోషల్ మీడియాను జవాన్ ఆక్రమించేశాడు. ఉదయం నుంచి జవాన్, షారుఖ్, అట్లీ, నయన్ తార, దీపికా పదుకొనె, విజయ్ సేతుపతి అనే పేర్లే వినిపిస్తున్నాయి తప్ప మరి ఇంకేం పేర్లు వినిపించడం లేదు. దానికి కారణం నేడు జవాన్ ప్రివ్యూను రిలీజ్ చేయడమే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. అసలు ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. షారుఖ్ ఖాన్ హీరో అంటేనే ఒక హైప్ ఉంటుంది. అందులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అనేసరికి అంచనాలు మాములుగా లేవు. ఇక నయన్ హీరోయిన్ అని, విజయ్ సేతుపతి విలన్ అని చెప్పడంతో అంచనాలు డబుల్ అయ్యాయి. ఇక చాలు బాబు అనుకొనేలోపు.. దీపికా స్పెషల్ అప్పీరియన్స్ అని చెప్పారు.. అస్సలు అభిమానులు ఆగలేదు.
SS.Thaman: ఇక్కడ ఏ గొట్టంగాడికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..
ఇవన్నీ పక్కన పెడితే.. జవాన్ లో దళపతి విజయ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు అనే ఒక్క మాట సినిమాపై అంచనాలను అమాంతం పైకి వచ్చేలా చేసాయి. ఏంటి.. నిజమా జవాన్ లో విజయ్ ఉన్నాడా .. ? అవన్నీ పుకార్లు మాత్రమే అని అనుకున్నవారు.. నేడు ప్రివ్యూలో విజయ్ షాట్ చూసి అవకావ్వుతున్నారు. కమాండర్ గా విజయ్.. విలన్స్ ను ఉతికి ఆరేస్తున్న షాట్ ను స్క్రీన్ షాట్ తీసి.. ఇది విజయ్ నే అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. విజయ్- అట్లీ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్నేహం కొద్దే జవాన్ లో విజయ్ ఒక గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడని సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాక్సాఫీస్ బద్దలు కావడం పక్కా అని చెప్పుకొస్తున్నారు అభిమానులు. ఇకపోతే జవాన్ ఈ ఏడాది సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.