కస్టమర్లను తప్పుదారి పట్టించేలా, కార్ల కంపెనీ ప్రచారం చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె పేర్లు వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్ హైకోర్టు వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసి, తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది. అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటంటే..
Also Read : Chiranjeevi : ఆమె ఎదురుగా కూర్చునేసరికి నాన్న స్టెప్స్ మర్చిపోయాడు – సుస్మిత కొణిదెల
రాజస్థాన్‌కు చెందిన కీర్తిసింగ్ రూ.23 లక్షలు పెట్టి హ్యుందాయ్ అల్కాజర్ కారును కొనుగోలు చేశారు. కానీ ఆ కారులో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తిందని, రిపేర్ చేయమన్నా కంపెనీ అధికారులు, డీలర్‌షిప్ నిరాకరించారని ఆయన ఆరోపించారు. దీంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీతో పాటు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుక్, దీపికాలపై ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో కీర్తిసింగ్ ఇలా పేర్కొన్నారు.. తాము నమ్మిన బ్రాండ్ అంబాసిడర్లు కూడా కస్టమర్లను తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం చేశారని, అందువల్ల వీరికి కూడా బాధ్యత ఉందని అన్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, షారుక్ ఖాన్ 1998 నుంచి హ్యుందాయ్ బ్రాండ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. దీపికా పదుకొణె 2023లో కంపెనీ అంబాసిడర్‌గా చేరారు. ఇప్పుడు కోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ, కేసు తుది పరిణామాలు ఏవి అనేది చూడాలి.
