Site icon NTV Telugu

Shah Rukh Khan: మెగా మేనల్లుడి టైటిల్ కొట్టేసిన బాలీవుడ్ బాద్షా?

Jawan

Jawan

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ చిత్రాన్ని ముగించే పనిలో ఉన్న విషయం విదితమే.. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, లీకైన దీపికా బికినీ ఫొటోస్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. గత కొన్నేళ్లుగా పరాజయాలను చవిచూస్తున్న షారుఖ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత షారుఖ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక తాజగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి ‘సఖి’ అనే టైటిల్ ను అనుకున్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘జవాన్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఈ టైటిల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారట. నిమిషం పైగా ఉండే ఆ టీజర్ లో కొన్ని డైలాగ్స్ కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమాను తెరక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ టైటిల్ తో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆల్రెడీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. బీవీఎస్ రవి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. మరి అదే పేరుతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ టైటిల్ లో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Exit mobile version