Jawaan Reshoot happening: ఈ మధ్య కాలంలో సినిమాల రీ షూట్లు సర్వ సాధారణం అయ్యాయి. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడని దర్శకులు అవుట్ పుట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. అవుట్ ఫుట్ సరిగా రాలేదని ఎడిటింగ్ లో అనిపిస్తే మళ్ళీ రీ షూట్ చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇక ఇప్పుడు జవాన్ కి ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాడట డైరెక్టర్ అట్లీ. కోట్లు ఖర్చు పెట్టి చేసిన పాటకి సాటిస్ఫై కాకపోవడంతో రీ షూట్ ప్లాన్ చేశాడని అంటున్నారు. షారుఖ్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ చేస్తున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తే బాలీవుడ్ షేక్ అయి 24 గంటల్లోనే 112 మిలియన్లకు పైగా ప్యూస్ రాబట్టింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి రీషూట్ ప్లాన్ చేశాడట డైరెక్టర్ అట్లీ. బాద్ షా , దీపికా పై ఓ చిన్న షెడ్యూల్ లో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడు అట్లీ.
Tamannaah Bhatia: ఆ హీరోల చూపంతా తమన్నా పైనే?
సీనియర్ డాన్స్ మాస్టర్ ఫరా ఖాన్ నేతృత్వంలో షూట్ చేయగా అవుట్ ఫుట్ చూసి మళ్ళీ తీయాలని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలో ఫరా ఖాన్ తీసిన ఫుటేజ్ ని పక్కన పడేసి వైభవీ మర్చంట్ ని రంగంలోకి దింపి మళ్ళీ ఫ్రెష్ గా షూట్ చేస్తున్నారు. ముంబైలో వేసిన ఖరీదైన సెట్లో వందలాది జూనియర్ ఆర్టిస్టులు, దేశ విదేశీ డాన్సర్లు, భారీ ఇంటీరియర్ల మధ్య గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జవాన్ లో దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్ కాదు కానీ ఒక స్పెషల్ క్యామియో చేసింది. అయినా సరే ఇంత ఖర్చు పెట్టి కొత్త కాల్ షీట్ తీసుకుని మరీ సాంగ్ తీయడం చూస్తుంటే దర్శక నిర్మాతలు ఏ దశలోనూ రాజీ పడేందుకు సిద్ధంగా లేరనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా చూసిన వారు అట్లీని ఏమైనా రాజమౌళి పూనాడా? ఏంటి ఈ ప్రాజెక్ట్ ని ఇంకా చెక్కుతూనే ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు.