Site icon NTV Telugu

Shabaash Mithu Teaser : 23 ఏళ్ల ఇన్స్పైరింగ్ స్టోరీ

Shabaash-mithu

Shabaash Mithu Teaser తాజాగా విడుదలైంది. ఇందులో మిథాలీ రాజ్ 23 ఏళ్ల ఇన్స్పైరింగ్ స్టోరీని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. వయాకామ్18 స్టూడియోస్ ఈరోజు 2022లోనే ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటైన Shabaash Mithu మూవీ టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రంలో తాప్సి పన్ను హీరోయిన్ గా నటిస్తుండగా, భారతదేశంలోని క్రికెట్ గేమ్ ఛేంజర్ అయిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. టీజర్ లో మిథాలీ సాధించిన విజయాలను హైలైట్ చేశారు.

Read Also : KGF Chapter 2 : అతనికి అడ్డు నిలబడకండి… “తూఫాన్” వచ్చేసింది !

చివరగా టీజర్ లో తాప్సి లుక్ ను రివీల్ చేశారు. “ఈ జెంటిల్‌మెన్ క్రీడలో ఆమె చరిత్రను తిరగరాయడానికి బాధపడలేదు… బదులుగా ఆమె తన కథను సృష్టించింది! #AbKhelBadlega #ShabaashMithu త్వరలో వస్తుంది! #BreakTheBias #ShabaashMithu #ShabaashWomen #ShabaashYou” అంటూ ఈ టీజర్‌ను తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఇక ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ యాక్టర్ విజయ్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. “శభాష్ మిథు” చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, ఏప్రిల్‌లో ముంబైలో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం గత నెలలో షూటింగ్‌ను పూర్తి చేశారు. లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో కొంత షూటింగ్ చేశారు మేకర్స్.

Exit mobile version