NTV Telugu Site icon

SeshEXShruti: అతన్ని ఇంట్రడ్యూస్ చేసిన శృతి హాసన్…

Sruthi Haasan

Sruthi Haasan

క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ లాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమాలని ఆడియన్స్ కి ఇచ్చాడు అడివి శేష్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలని చేసే అడివి శేష్, ఈసారి శృతి హాసన్ తో కలిసి మరో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వస్తున్నాడు. ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీకి ప్రస్తుతం చిత్ర యూనిట్ #SeshEXShruti అనే ట్యాగ్ ని వాడుతున్నారు. డీఓపీ షనీల్ డియో మొదటిసారి దర్శకుడిగా మారి చేస్తున్న ఈ సినిమా టైటిల్ రివీల్ టైమ్ వచ్చేసింది. డిసెంబర్ 18న #SeshEXShruti టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నట్లు శేష్ అనౌన్స్ చేసాడు. అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ సినిమాస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ కలిసి #SeshEXShruti సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. శృతి హాసన్, అడివి శేష్ కలిసి నటించడం ఇదే మొదటిసారి.

శృతి హాసన్ #SeshEXShruti నుంచి అడివి శేష్ ప్రీలుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. అడివి శేష్ ఫేస్ ని కవర్ చేసుకుంటూ బ్లాక్ కర్చీఫ్ కట్టుకోని ఉన్నాడు. శృతి హాసన్ రోల్ కి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయితే ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. #SeshEXShruti అనే హ్యాష్ ట్యాగ్ ని చూసిన వాళ్లు మాత్రం ఇది మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ అనే హాలీవుడ్ సినిమాలా ఉండబోతుందా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రీమేక్ చేసినా తన మార్క్ చూపించే అడివి శేష్… మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ సినిమా చేస్తున్నాడా లేక కొత్త సినిమానా అనే విషయంలో క్లారిటీ డిసెంబర్ 18న ఇవ్వనున్నాడు. మరి శేష్ నుంచి ఈసారి ఎలాంటి సినిమా రాబోతుందో చూడాలి.