NTV Telugu Site icon

Manasa Priyatham: బుల్లితెర జంట విడాకులు.. టార్చర్ అనుభవిస్తున్నా.. సిగ్గులేకుండా చెప్తున్నా

Priyarham

Priyarham

Manasa Priyatham: సెలబ్రిటీలు ప్రేమలు, పెళ్లిళ్లు.. విడాకులు ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు. ఈ ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయారు. తాజాగా ఒక బుల్లితెర జంట విడిపోయినట్లు తెలుస్తోంది. బుల్లితెర హీరో ప్రియతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసు మమత సీరియల్ తో అతను కెరీర్ ప్రారంభించాడు. ఈ సీరియల్ సూపర్ హిట్ గా నిలవడంతో ప్రియతమ్ చరణ్ కు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇకపోతే ప్రస్తుతం పాపే మా జీవనజ్యోతి సీరియల్ లో నటిస్తున్నాడు. ఇక చరణ్.. నటి మానసను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎన్నో షోస్ లలో పాల్గొన్నారు కూడా. అయితే గతకొంతకాలంగా ఈ జంట మధ్య విబేధాలు తలెత్తడంతో విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. కొన్నిరోజుల నుంచి మానస చేసే యూట్యూబ్ వ్లాగ్స్ లో చరణ్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అభిమానులందరూ.. చరణ్ తో మీరు విడిపోయారా.. ? విడాకులు తీసుకున్నారా.. ? అని ప్రశిస్తుంటే.. చివరికి మానస తన మనసులోని మాటను బయటపెట్టింది.

చరణ్, తానూ విడాకులు తీసుకోలేదు కానీ విడిగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇద్దరం తప్పులు చేశామని, కానీ, ఆ ఫలితం మాత్రం తానే అనుభవిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తనకున్న సంపాదన కేవలం ఈ యూట్యూబ్ మాత్రమే అని, ఆ విషయాన్నీ సిగ్గులేకుండా చెప్తున్నా అని చెప్పుకొచ్చింది. గత నాలుగు నెలలుగా ప్రతిఒక్కరు ఇదే విషయాన్నీ అడిగి టార్చర్ చేస్తున్నారని, అందుకే ఇప్పుడు చెప్తున్నట్లు తెలిపింది. విడాకులు కావాలని కూడా కోరుకోవట్లేదని, కానీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పింది. ఇప్పుడు కూడా తాను స్టాండ్‌ తీసుకోకపోతే తన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళనగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.