NTV Telugu Site icon

Nikhil- Kavya: గోరింటాకు సీరియల్ ఫేమ్ నిఖిల్- కావ్య పెళ్లి.. ?

Nikhil Kavya

Nikhil Kavya

Nikhil- Kavya: వెండితెరపై కపుల్స్ చాలామంది ఉన్నారు. రీల్ అయినా రియల్ అయినా కూడా వారిని చూస్తే భలే ముచ్చటేస్తూ ఉంటుంది. పెళ్లికానీ వారు అయితే.. ఈ జంట పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ప్రభాస్- అనుష్క, విజయ్ దేవరకొండ- రష్మిక.. ఇలా ఈ జంటలు పెళ్లి చేసుకుంటే బావుంటుంది అనుకుంటారు. కానీ, తాము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ అని ఈ జంటలు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాయి. ఇక ఇలాంటి జంటలే బుల్లితెరపై కూడా ఉన్నాయి. అందులో సుధీర్ రష్మీ మొదట ఉంటుంది. ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా.. ? అని ఎంతోమంది వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ, సుధీర్ రష్మీ మాత్రం.. తాము కేవలం ఆన్ స్క్రీన్ రొమాన్స్ మాత్రమే చేసామని, ఆఫ్ స్క్రీన్ లో మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు వీరిలానే మరో జంట తయారయ్యింది. వారే నిఖిల్, కావ్య శ్రీ. గోరింటాకు సీరియల్ ద్వారా వీరు పరిచయమయ్యారు.

కావ్య బెంగుళూరు అమ్మాయి. ఈ సీరియల్ బిగా హిట్ అవ్వడంతో ఈ జంట ఫేమస్ అయ్యారు. ఇక ఎంటర్ టైన్మెంట్ షోస్, డ్యాన్స్ షోస్ లలో వేరు కలిసి కనిపించారు. వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ ను కూడా రన్ చేస్తున్నారు. దీంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అని కొందరు, రిలేషన్ లో ఉన్నారు అని ఇంకొందరూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక సీరియల్ చేస్తున్నారు.. ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిఖిల్.. వారి పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. కావ్య చాలా మంచి అమ్మాయి అని,తను బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడం తాను చేసుకున్న అదృష్టమని చెప్పుకొచ్చాడు. పెళ్లి అని అందరూ అంటూ ఉన్నారు కానీ, అందులో నిజం లేదు.. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లో పెళ్లి ప్రెషర్ లేదు అని, ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచన లేదని చెప్పుకొచ్చాడు.