Site icon NTV Telugu

Meena Sagar: భర్త మృతి తరువాత ఫోటో షూట్ తో రచ్చ చేసిన మీనా

Meena

Meena

Meena Sagar: టాలీవుడ్ సీనియర్ నటి మీనా సాగర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన మీనా జీవితంలో ఇటీవలే విషాదం చోటుచేసుకున్న విషయం విదితమే.. మీనా భర్త సాగర్ లంగ్స్ ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందిన విషయం తెల్సిందే. దీంతో ఒక్కసారిగా మీనా జీవితం తలక్రిందులయ్యిపోయింది. ఇక భర్త మరణంతో కృంగిపోయి కూర్చుంటే ఎలా..? బిడ్డను బ్రతికించుకోవాలి..? ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటే ఆ బాధ తగ్గుతోందా అనుకున్నదో ఏమో మీనా సినిమాలపై ఫోకస్ పెట్టింది.. వరుస సినిమాలతో బిజీగా మారింది.

ఇక తాజాగా ఆమె ఒక ఫోటోషూట్ లో పాల్గొని మెప్పించింది. ఒక లిఫ్ట్ లో కలర్ ఫుల్ డ్రెస్ ల్లో కనిపించి మెప్పించింది. పింక్ కలర్ డ్రెస్ .. కర్లీ హెయిర్ తో మీనా ఎంతో అందంగా కనిపించింది. ఇక ఇటీవలే ఆమె తన పుట్టినరోజును జరుపుకొంది. భర్త మరణంతో దిగాలుగా ఉన్న ఆమెను సంతోష పర్చడం కోసం ఆమె స్నేహితులు స్నేహ, రమ్యకృష్ణ తదితరులు ఈ పార్టీని ఎరేంజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మీబునా తెలుగులో కూడా బిజీగా మారుతుందేమో చూడాలి.

Exit mobile version