NTV Telugu Site icon

K. Vasu: ఇండస్ట్రీలో విషాదం.. చిరంజీవి మొదటి సినిమా డైరెక్టర్ మృతి..

Vasu

Vasu

K. Vasu: కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వరుస మరణాలు అందరిని వణికిస్తున్నాయి. సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వరుసగా మృత్యువాత పడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, శరత్ బాబు, నిఖిల్ పాండే, ఆదిత్య సింగ్ రాజ్ పుత్, వైభవి ఉపాధ్యాయ, హాలీవుడ్ నటి సమంత.. ఇలా వరుస మరణాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ మరణాలనే ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్న సమయంలో ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ డైరెక్టర్ కె. వాసు మృతి చెందారు. గత కొన్ని ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు నెలలుగా ఆయనకు డయాలసిస్ కూడా చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూనే వాసు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ గా వాసుకు మంచి గుర్తింపు ఉంది.

Niharika Konidela: మెగా డాటర్ మరీ హద్దు మీరీ.. దాన్ని చూపిస్తూ

కె. వాసు.. 1951, జనవరి 15 న జన్మించారు. ఆయన తండ్రి కె.ప్రత్యగాత్మ కూడా దర్శకులే. చిన్నతనం నుంచి దర్శకత్వం పై మక్కువ పెంచుకున్న వాసు.. తన తండ్రి ప్రత్యగాత్మ వద్ద ఆదర్శకుటుంబం, మనసు మాంగల్యం, పల్లెటూరి బావ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత ఆడపిల్లల తండ్రి అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించి స్వంతంగా నిర్మించాడు. 22యేళ్ల పిన్నవయసులోనే దర్శకత్వం వహించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి హీరోగా పెట్టి ప్రాణం ఖరీదు అనే సినిమాను తెరకెక్కించాడు. చిరు మొదటి సినిమా పునాది రాళ్లు అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు అనే చెప్పాలి. ఈ చిత్రం చిరుకు, ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత చిరుతో కలిసి ఆయన ఆరని మంటలు, కోతల రాయుడు, అల్లుళ్ళొస్తున్నారు లాంటి సినిమాలు చేశారు. ఇక చివరగా వాసు దర్శకత్వం వహించిన చిత్రం గజిబిజి. కాగా, వాసు మృతి వార్త విన్న ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.