Site icon NTV Telugu

Salim Ghouse : బాలీవుడ్ లో విషాదం సీనియర్ నటుడు కన్నుమూత!

Ghouse

Ghouse

సీనియర్ బాలీవుడ్ నటుడు సలీమ్ గౌస్ (70) గురువారం ఉదయం గుండెపోటుతో ముంబైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన భార్య అనిత సలీమ్ ధృవపరిచారు. ‘బుధవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని సలీమ్ చెప్పడంతో, కోకిలాబెన్ హాస్పిటల్ లో చేర్చామని, గురువారం ఉదయం ఆయన హార్ట్ అటాక్ తో కన్నుమూశార’ని ఆమె తెలిపారు. ‘భారత్ ఏక్ ఖోజ్’, ‘సుబహ్‌’, ‘ఇన్కార్’ తో పాటు పలు టీవీ సీరియల్స్ లో సలీమ్ గౌస్ కీలకపాత్రలు పోషించారు. అలానే ‘సారాంశ్, మంథన్, కలియుగ్, చక్ర, మోహన్ జోషీ హాజిర్ హో, త్రికాల్, అఘాత్, ద్రోహి, సోల్జర్, మహారాజా, ఇండియన్, వెల్ డన్ అబ్బా’ వంటి చిత్రాలలో సలీమ్ నటించారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రవేశం ఉన్న సలీమ్ గౌస్ తెలుగులో ‘అంతం, రక్షణ, ముగ్గురు మొనగాళ్ళు’ తదితర చిత్రాల్లో నటించడం విశేషం. సలీమ్ గౌస్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు.

Exit mobile version