NTV Telugu Site icon

Pushpalatha: సీనియర్ నటి పుష్పలత కన్నుమూత..

February 7 (28)

February 7 (28)

గత రెండేళ్లుగా ఇండస్ట్రీలో వరుసగా విషాదలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు రకరకాల కారణాల వల్ల మరణించారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటి పుష్పలత కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో 87 ఏళ్ల పుష్పలత మంగళవారం రాత్రి చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచింది. ఈ విషయం తెలిసిన చాలామంది ప్రముఖ నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.

Also Read:Shriya Saran: సూర్య ‘రెట్రో’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్

కెరీర్ పరంగా భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం అలాగే కన్నడ భాషల్లో 100కు పైగా సినిమాలు చేసింది పుష్పలత.ఎన్టీఆర్‌ హీరోగా కోవెలమూడి భాస్కర్‌ రావ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెరపకురా.. చెడేవు’ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తమిళ సినిమాలో ప్రముఖ హీరోలైన ఎంజిఆర్, శివాజీ గణేషన్, జైశంకర్, జెమినీ గణేషన్ లతో కలిసి నటించింది. అనంతరం తెలుగు ఇండస్ట్రీలో ఆ తర్వాత ఆడబిడ్డ, మా ఊరిలో మహాశివుడు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, రక్త బంధం, శూలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, ప్రతిజ్ఞ, మూగవాని పగ, ఉక్కుమనిషి, రంగూన్‌ రౌడీ, విక్రమ్‌ వంటి చిత్రాలలో నటించి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ఇక వ్యక్తిగత విషయానికి వస్తే 1963లో ఎ. వి. ఎం. రాజన్ నటించిన ‘నానుమ్ ఒరు పెన్’ చిత్రంలో నటించిన పుష్పలత ఆ సినిమా షూటింగ్ సమయంలో నటుడు రాజన్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇందులో ఒక కూతురు హీరోయిన్ గా రాణించింది.