NTV Telugu Site icon

Jamuna: జమున కు తలకొరివి పెట్టిన కూతురు.. కొడుకు ఏమయ్యాడు..?

Jamuna

Jamuna

Jamuna: అలనాటి అందాల తార జమున కనుమరుగైపోయింది. సినీ వినీలాకాశంలో చందమామలా విరిసిన పూబాల గగనానికి ఎగిసిపోయింది. 86 ఏళ్ళ వయస్సున్న జమున నేడు కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆమె మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు ముగిసాయి. జమున కుమార్తె స్రవంతి ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. హిందూ సంప్రదాయాలను అనుకరిస్తూ ఆమె తల్లి చితికి నిప్పు అంటించారు. ఇక ఈ అంత్యక్రియల్లో పలువురు ప్రముఖులు సైతం పాల్గొన్నారు. అయితే జమునకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నాడని, రావడానికి ఆలస్యం కానున్నదని తెలియడంతో కుమార్తె స్రవంతినే తల్లి దహన సంస్కారాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.