NTV Telugu Site icon

Actor Suresh : జనసేనానికి జై కొట్టిన నటుడు సురేష్..

Suresh

Suresh

ఏపీలో ఎన్నికల నగరా మోగింది.. ఎన్నికల్లో తమ పార్టీని నిలుపుకోవాలని జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.. నువ్వా నేనా అంటూ నేతన్నలు తెగ హడావిడి చేస్తున్నారు..రాజకీయ పార్టీలకు మద్దతుగా సినీనటులు ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. ప్రత్యేకించి తెలుగు నాట సినీనటులు చాలా కాలం నుంచే ఎన్నికల ప్రచారం చేసిన ఘటనలు ఉన్నాయి.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోని చాలా మంది నటులు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు.. పోలింగ్ కు ఇక నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో సినీ స్టార్స్ సోషల్ మీడియాలో హోరేత్తిస్తున్నారు.. తాజాగా మరో నటుడు పవన్ కు జై కొట్టాడు..

టీడీపీ, బీజేపీ తో పొత్తులతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటి చేస్తున్న విషయం తెలిసిందే.. ఆయనకు మద్దతుగా ఇప్పటికే చాలామంది చోటామోటా నటులు ప్రచారం చేస్తున్నారు. ఆయన సోదరులు నాగబాబు పార్టీలో చాలా చురుగ్గా పాల్గొంటుండగా ఆయన అన్న చిరంజీవి తమ తమ్ముణ్ణి గెలిపించమని విజ్ఞప్తి చేశాడు.. ఇక సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ లో పవన్ తో పాటు తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు..

ఇక సినీ ఇండస్ట్రీలోని నటీనటులు పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.. తాజాగా మరో సీనియర్ నటుడు పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపాడు.. సీనియర్ నటుడు సురేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన వాగ్దానాలను అందజేసే నాయకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను!.. ఆయనకు మీ అమూల్యమైన ఓటును అందించి గెలిపించాలని ప్రార్దిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..