NTV Telugu Site icon

Mohanlal: మోహన్‌లాల్ పచ్చి మోసగాడు.. చనిపోయేలోపే అతని బండారం బయటపెడతా

Sreenivasan On Mohanlal

Sreenivasan On Mohanlal

Senior Actor Srinivasan Sensational Comments On Mohanlal: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌పై సీనియర్ నటుడు శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్‌లాల్ పచ్చి మోసగాడని.. తెరవెనుక ఒక రకంగా, తెరముందు మరో రకంగా మాట మార్చాడని బాంబ్ పేల్చారు. దివంగత నటుడు‌ ప్రేమ్‌ నజీర్‌ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారని, అందులో మోహన్‌లాల్‌ని కథానాయకుడిగా తీసుకోవాలని అనుకున్నారని, కానీ ఆ ప్రాజెక్ట్‌ని మోహన్‌లాల్ తిరస్కరించాడని ఒక సీక్రెట్ బయటపెట్టారు. కానీ.. ప్రేమ్ నజీర్ చనిపోయిన తర్వాత మీడియా ముందు మోహన్‌లాల్ మాట మార్చాడంటూ ఆరోపణలు చేశారు.

CSK vs LSG: ముగిసిన చెన్నై బ్యాటింగ్.. లక్నోకి భారీ లక్ష్యం

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ‘‘మోహన్‌లాల్‌తో ఒక సినిమా తీయాలన్న కోరిక ప్రేమ్ నజీర్‌కు ఉండేది. కడతనందన్‌ అంబాడీ సినిమా షూటింగ్ సమయంలో.. ప్రేమ్ నాకు ఆ విషయం చెప్పాడు. అప్పుడు నేను మోహన్‌లాల్‌కు సరిగ్గా సూటయ్యే ఒక మంచి కథను సిద్ధం చేసుకోమని సూచించాను. దీంతో.. ప్రేమ్ ఒక కథని సిద్ధం చేశాడు. స్టోరీ రాసిన తర్వాత మోహన్‌లాల్‌ని సంప్రదించి, అతనికి వినిపించాడు. అయితే.. మోహన్‌లాల్ ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ఇది ప్రేమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో.. నేను ఓసారి నడరాజన్‌ అనే మధ్యవర్తి ద్వారా మోహన్‌లాల్‌కి కథ వినిపించాను. ఆ సమయంలో మోహన్‌లాల్ అతడ్ని తిట్టేశాడు. అదే స్టోరీతోనే ‘సందేశం’ సినిమా రిలీజ్ అయ్యింది’’ అంటూ చెప్పుకొచ్చారు.

Honeymoon: పెళ్లయిన కొత్త జంటల కోసం 10 బెస్ట్ హనీమూన్ స్పాట్స్

నిజానికి.. ఈ సినిమా కోసం మోహన్‌లాల్‌కు ప్రేమ్ ముందుగానే అడ్వాన్స్ ఇచ్చాడని, అయితే ఆ సమయంలో ఆయన ఎంగేజ్‌మెంట్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదని శ్రీనివాసన్ తెలిపారు. ఆ తర్వాత కొంతకాలానికే ప్రేమ్‌ కన్నుమూశారన్నారు. ప్రేమ్ చనిపోయాక మోహన్‌లాల్ మీడియా ముందు మొసలి కన్నీరు కారుస్తూ.. ప్రేమ్ సినిమాలో నటించాలనుకున్నానని, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయిందంటూ కపట మాటలు మాట్లాడాడని ఆరోపించారు. మోహన్‌లాల్ మోసగాడంటూ కోపంతో రగిలిపోయిన శ్రీనివాసన్.. తాను చచ్చేలోపు అతని నిజస్వరూపం మొత్తం బయటపెడతానంటూ చెప్పారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కేరళలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Wife Killed Husband: భర్తను చంపిన భార్య.. కోర్టు ఏం శిక్ష విధించిందో తెలుసా?

ఈ వ్యాఖ్యలపై ప్రేమ్ నజీర్ తనయుడు షానవాజ్ కూడా స్పందించాడు. తన తండ్రి మోహన్‌లాల్‌తో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమేనని ధృవీకరించాడు. అయితే.. మోహన్‌లాల్‌ స్క్రిప్ట్ డిస్కషన్స్‌కు ఎప్పుడూ ప్రియదర్శన్‌ను వెంటేసుకుని వచ్చేవారని తెలిపాడు. మరి.. తన తండ్రి చెప్పిన కథ ఎందుకు పట్టాలెక్కలేదో ఎవ్వరికీ తెలియదన్నాడు. కానీ.. శ్రీనివాసన్ చెప్పారంటే.. అందులో ఏదో ఒక నిజం ఉండనే ఉంటుందని పేర్కొన్నాడు.