Site icon NTV Telugu

Chalapathi Chowdary: విషాదం.. నటుడు చలపతి మృతి

Chalapathi Chowdary

Chalapathi Chowdary

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు చలపతి చౌదరి కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని రాయ్‌చూర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. చలపతి చౌదరి  తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 100 చిత్రాల్లో నటించారు.

ఇటీవల బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అంతేకాకుండా చిరంజీవి, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్  హీరోల సినిమాలలోనూ చలపతి కనిపించారు. ఇక సినిమాలతో పాటు పలు సీరియళ్ళలోనూ నటించి మెప్పించిన ఆయన 67 ఏళ్లకు మృతి చెందడం బాధాకరమని పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version