‘లీడర్’ సీక్వెల్ తప్పకుండా చేస్తాను.. హీరో అతడే: శేఖర్ కమ్ముల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24న థియేటర్లోకి రానుంది. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హాట్టహాసంగా జరిగింది. ఇక చిత్రబృందం కూడా లవ్ స్టోరీ ముచ్చట్లతో బిజీబిజీగా ప్రమోషన్ చేస్తున్నారు. కాగా, దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. తన తదుపరి సినిమాల గూర్చి తెలియజేశారు. ‘లవ్ స్టోరీ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తోని తెలిపారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నామన్నారు. ధనుష్ కు బాలీవుడ్ లోను మార్కెట్ ఉంది. అందుకే పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నాము’ అని తెలిపారు.
ఇక లీడర్ సినిమా గూర్చి మాట్లాడుతూ.. ‘నేను తీసిన ‘లీడర్’ సినిమా అప్పుడు అందరు మామూలుగానే చూశారు కానీ ఇప్పుడు ఇంకా ఆ సినిమా గూర్చి మాట్లాడుకుంటారు. అలానే నేను ప్రతీ సినిమాని సన్నివేశాన్ని ఇంతకు మించి ఎవరూ తియ్యలేరు అన్నట్టుగా చెయ్యాలని ప్రయత్నిస్తాను. ఒక పదేళ్ల తర్వాత నా పిల్లలకి కూడా గర్వంగా సినిమా చూపించగలగాలి అనుకుంటాను. ‘లీడర్’ సినిమా సీక్వెల్ ఖచ్చితంగా చేస్తా, కానీ ఇప్పుడు కాదు. అదే పాత్రలతో రానా ఖచ్చితంగా ఉంటాడు. ఆ పాత్రలతోనే నడిచే విధంగా సీక్వెల్ చేస్తాను’ శేఖర్ కమ్ముల తెలిపారు.
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?