NTV Telugu Site icon

Sekhar Basha: శేఖర్ బాషాను రౌడీలతో కొట్టించిన లావణ్య?

Attack On Sekhar Basha

Attack On Sekhar Basha

Sekhar Basha Alleges Lavanya’s Goons attacked him: లావణ్య రాజ్ తరుణ్ వివాదం ప్రతిరోజు ఏదో ఒక ఆసక్తికరమైన అంశంతో తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా రాజ్ తరుణ్ స్నేహితుడిగా చలామణి అవుతూ లావణ్య గురించి అనేక విషయాలను బయటపెడుతూ వస్తున్న శేఖర్ బాషా మీద లావణ్య రౌడీలతో దాడి చేయించినట్లు ఆరోపించాడు. కొద్దిరోజుల క్రితం ఒక ఛానల్లో మాట్లాడుతున్న సమయంలో ఆమె మ్యూజిక్ టీచర్ గా పని చేస్తూ స్కూల్ పిల్లలకు సైతం డ్రగ్స్ అలవాటు చేస్తుందని ఆరోపించాడు. అలా ఆరోపిస్తున్న సమయంలోనే లావణ్య సంయమనం కోల్పోయి చెప్పుతో దాడి చేసింది.

Kumaradevam Movies Tree : 300 సినిమాల్లో కనిపించిన చెట్టు ఇక లేదు

వెంటనే ఛానల్ నిర్వాహకులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినా సరే తర్వాత తాను ఏ ఛానల్ కి వెళ్ళినా సరే ఆ ఛానల్ కి ఫోన్ చేసి లేదా తనకు ఫోన్ చేసి బీపీ తెప్పించి ఆ ప్రోగ్రాం పూర్తి చేయకుండానే బయటకు వచ్చేసేలా చేసేదని అతను ఆరోపిస్తున్నాడు. అంతేకాదు చేతికి కట్టు కట్టుకుని ఒక వీడియో రిలీజ్ చేసిన శేఖర్ భాష నిన్న తన అడ్వకేట్ దిలీప్ సుంకరతో కలిసి కొంతమంది రౌడీలతో తనను లావణ్య దాడి చేయించిందని ఆరోపిస్తున్నారు. ఎక్కడ దాడి చేయించారు? ఎంతమంది దాడి చేయించారు? అనే విషయం మీద ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. కానీ తన దగ్గర ఆధారాలు ఉన్నాయని భావిస్తూ లావణ్య భయపడుతోందని అందుకే తనమీద దాడి చేసిందని శేఖర్ భాష ఆరోపిస్తున్నారు.

Show comments