NTV Telugu Site icon

‘సెహరి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Sehari

కొద్దికాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలోనూ ‘సెహరి’ మూవీ ట్రైలర్ హంగామా సృష్టిస్తోంది. హర్ష్ కానుమిల్లి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సినిమాపై అందరి దృష్టీ పడేలా చేశాయి. జ్ఞానసాగర్ దర్శకత్వంలో అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఫిబ్రవరి 11న తమ ‘సెహరి’ జనం ముందుకు రాబోతోందని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ రిలికల్ వీడియోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింద’ని చెప్పారు. ఈ మూవీ కథ, కథనం, పాత్రలు అన్నీ యూత్ ను, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయనే ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చాడు.

Read Also : టీజర్ : ‘మహాన్’ పోరాటం… ప్రామిస్ నిలబెట్టుకోని విక్రమ్