Site icon NTV Telugu

సీటీమార్‌: ఆకట్టుకున్న మోటివేషన్ లిరికల్ సాంగ్

Seetimaarr

Seetimaarr

నటుడు గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సీటీమార్ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. గోపీచంద్ సరసన తమన్నా నటిస్తోంది. స్పోర్ట్స్‌ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఆంధ్ర కబడ్డీ టీమ్‌ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా తమన్నా నటించారు. సంపత్‌ నంది దర్శకత్వంలో పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సెప్టెంబర్‌ 3న విడుదల అవుతున్న సందర్బంగా సినిమాని ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్రబృందం ప్రమోషన్ వేగాన్ని పెంచింది. తాజాగా సీటీమార్‌ నుంచి కబడ్డీ కోసం బరిలో దిగిన జట్లను ఉద్దేశిస్తూ సాగిన మోటివేషన్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. గోపీచంద్, తమన్నాలు ప్లేయర్స్ ను పరిచయం చేస్తూ కబడ్డీ కోర్టు బరిలో దింపుతున్నారు. మణిశర్మ మ్యూజిక్ ఆకట్టుకొగా.. సౌందర్‌ రాజన్‌ కెమెరా వర్క్స్ చాలా సహజంగా వుంది.

Exit mobile version