Site icon NTV Telugu

“సీటిమార్” మేకింగ్ వీడియో

Seetimaarr Making Video Out Now

మాచో హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “సీటిమార్”. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో భూమిక చావ్లా, రహమాన్ ముఖ్యమైన పాత్రలు చేసారు. దిగంగన సూర్యవంశీ రిపోర్టర్ పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించారు. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. మంచి కలెక్షన్లతో నిర్మాతలకు లాభాలు తెచ్చే దిశగా పరుగులు పెడుతోంది. గోపీచంద్ చాలా కాలం తరువాత “సీటిమార్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం అంతా సినిమా హిట్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో “సీటిమార్” నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

Read also : శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో సామ్ నెక్స్ట్ మూవీ ?

ఈ వీడియోలో సినిమా ప్రారంభోత్సవం నుంచి పూర్తయ్యే వరకు చూపించారు. అందులో సినిమాలోకి ముఖ్యమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలను సైతం ఎలా చిత్రీకరించారో చూపించారు. 1.45 నిముషాలు కొనసాగిన ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది. మీరు కూడా “సీటిమార్” మేకింగ్ వీడియోను వీక్షించండి.

Exit mobile version