Seetharatnam Gari Abbayi : ముప్పై ఏళ్ళ ‘సీతారత్నంగారి అబ్బాయి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(మార్చి 19న ‘సీతారత్నంగారి అబ్బాయి’కి 30 ఏళ్ళు)
కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్లను జనం భలేగా ఆదరిస్తారు. వినోద్ కుమార్, రోజా జంటను అప్పట్లో ప్రేక్షకులు మెచ్చారు. వారు నటించిన చిత్రాలను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ రూటులో సాగేలా చేశారు. అలా వారు నటించిన ‘సీతారత్నం గారి అబ్బాయి’ చిత్రాన్ని విజయపథంలో పయనింప చేశారు. 1992 మార్చి 19న విడుదలైన ‘సీతారత్నంగారి అబ్బాయి’ మంచి విజయం సాధించి, వినోద్ కుమార్, రోజా జోడీకి మంచి పేరు సంపాదించి పెట్టింది.
ఈ సినిమా కథేమిటంటే- ఊరందరికీ మంచి చేసే సీతారత్నం తన భర్త ఎప్పుడో చేసిన తప్పుకు శిక్షగా అతనితో ఒకే ఇంట్లో ఉంటూనే వేర్వేరుగా జీవిస్తూ ఉంటారు. భర్త తాగుడుకు బానిసై ఉంటాడు. ఆ ఊరికి వంశీ అనే ఓ అబ్బాయి బ్యాంక్ మేనేజర్ గా వస్తాడు. అతనికి ఎక్కడా ఇల్లు దొరకదు. దాంతో సీతారత్నం ఇంట్లో అద్దెకు దిగుతాడు. సీతారత్నంకు బుల్లెబ్బాయ్ అనే ఓ అన్నయ్య అతనికి ఓ కొడుకు, ఓ కూతురు ఉంటారు. ఆ అమ్మాయి పేరు మంగ. ఆమెకు పెళ్ళి పిచ్చి. అసలే వంశీని చూడగానే మనసు పారేసుకుంటుంది. సీతారత్నం, వంశీని సొంత కొడుకులా చూసుకుంటూ ఉంటుంది. అందరూ అతణ్ణి సీతారత్నంగారి అబ్బాయి అనే అంటూ ఉంటారు. బుల్లెబ్బాయ్ కూడా వంశీతో మంగ పెళ్ళికి అంగీకరిస్తాడు. దాంతో వంశీ తన తల్లిని తీసుకు వస్తాడు. ఆమె సీతారత్నం మొగుడి మొదటి పెళ్ళాం. వంశీ తన కొడుకే అని తెలుసుకొని అతను మురిసిపోతాడు. కానీ, ఈ విషయాన్ని అటు ఆయన కానీ, వంశీ తల్లికానీ బయట పెట్టరు. మొదటి నుంచీ మంగ అన్నయ్యకు వంశీ అంటే గిట్టదు. అతను వంశీని తండ్రెవరో తెలియని వెధవ అంటాడు. ఆ తరువాత తన అత్త సీతారత్నంకు తెలిసివచ్చేలా ఓ నాటకం ఆడతాడు. అప్పుడు వంశీ, సీతారత్నం భర్తనే తన కన్నతండ్రి అని చెప్పడంతో ఆమె కుంగిపోతుంది. మంగ పెళ్ళి వేరే వాడితో చేసే ప్రయత్నంలో తాళి కట్టేటప్పుడు లేచి గుడిలో దాక్కుంటుంది. తన దగ్గరకు ఎవరూ రాకుండా వివస్త్ర అవుతుంది. వంశీ వచ్చి మంగకు బట్టలు కట్టి తీసుకు పోతాడు. అయితే సీతారత్నం తన భర్త మొదటి భార్య తన కోసమే భర్త ఎదురుగా ఉన్నా, చెప్పలేదని ఆమె భావిస్తుంది. అందరూ బాగుండాలని ఆశిస్తూ ఆమె ఉత్తరం రాసి మరణిస్తుంది. నా ఇంట్లో నా భర్త తన భార్యతోనూ, నా కొడుకు నా మేనకోడలుతో సుఖంగా కాపురం చేసుకోవాలనే ఇలా చేశానని ఉత్తరంలో రాసి ఉంటుంది. సీతారత్నంకు అందరూ కలసి అంత్యక్రియలు చేస్తారు. ఆమె చితికి వంశీ నిప్పు పెట్టడంతో కథ ముగుస్తుంది.
Also Read
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
- SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
- Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
వినోద్ కుమార్, వాణిశ్రీ, రోజా, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, శ్రీకాంత్, నిర్మలమ్మ, మణిమాల, అనిత, వాసుకి, చిడతల అప్పారావు, ఆలీ, గరగ, జిత్ మోహన్ మిత్ర ముఖ్యపాత్రధారులు.
శ్రీవేంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి కథను యూనిట్ స్వయంగా సమకూర్చుకుంది. యల్.బి.శ్రీరామ్ మాటలు రాశారు. రమణి-బాబూరావు రచనా సహకారం అందించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చగా, వేటూరి, సీతారామశాస్త్రి, భువనచంద్ర పాటలు పలికించారు. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు. ఇందులోని “మేఘమా మరువకే…”, “మత్తుగా గమ్మత్తుగా…”, “నా మొగుడే బ్రహ్మచారి…”, “ఆ పాపి కొండల్లో…”, “పసివాడో ఏమిటో ఆ పైవాడు…” పాటలు అలరించాయి. ‘సీతారత్నంగారి అబ్బాయి’ మంచి విజయం సాధించింది. జంధ్యాల అసోసియేట్ గా పనిచేయడం వల్ల ఇ.వి.వి. సత్యనారాయణ సైతం కథను నడిపిన తీరులో గురువును అనుసరించిన తీరు ఇట్టే తెలిసిపోతుంది.
తాజావార్తలు
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
-
Kishan Reddy : ఓట్ల చోరీ చేయం.. మనసులే గెలుస్తాం
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?