Site icon NTV Telugu

Seetha Kalyana Vaibhogame: ఆసక్తికరంగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ ఫస్ట్ లుక్

Seetha Kalyana Vaibhogame

Seetha Kalyana Vaibhogame

Seetha Kalyana Vaibhogame FirstLook Released: ఈ రోజుల్లో సినిమాల మీద ఆసక్తి క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని సార్లు టైటిల్స్‌తోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఆసక్తికరమైన టైటిల్‌తో ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే చిత్రం రాబోతోంది. అసలే ఇప్పుడు దేశం అంతా జై శ్రీరామ్ అనే నినాదం మార్మోగిపోతోండగా వచ్చిన హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు సీతా కళ్యాణ వైభోగమే అంటూ రాబోతున్న ఈ సినిమా టైటిల్‌తోనే పాజిటివ్‌ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందని యూనిట్ వెల్లడించింది. సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

The Family Star: నాలాంటి దాన్ని వాడుకుని వదిలేస్తే ఇంతే.. ఫ్యామిలీ స్టార్ యూనిట్ పై నటి సంచలన వ్యాఖ్యలు

భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా రాబోతోంది. గోవాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ నేతృత్వంలో దాదాపు 250 మంది డ్యాన్సర్లతో ఈ చిత్రంలోని ఒక పాటను చిత్రీకరించిన సంగతి తెలిసిందే, ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే..లవ్ అండ్ యాక్షన్ మూవీని చూడబోతోన్నట్టుగా కనిపిస్తోంది. రాచాల యుగంధర్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 100 మంది ఫైటర్లతో చిత్రీకరించిన భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు. గగన్ విహారి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, కెమెరామెన్ పరుశురామ్, ఎడిటర్ డి. వెంకట ప్రభు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్, పోలాకి విజయ్ పనిచేస్తున్నారు.

Exit mobile version