మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం “ఆచార్య”. తాజాగా విడుదలైన “ఆచార్య” ట్రైలర్ లో హై-ఆక్టేన్ యాక్షన్ స్టంట్స్, గ్రాండ్ సెట్‌లు, ఫైట్స్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఆచార్య”కు సంబంధించిన మరో సర్ప్రైజ్ ను మేకర్స్ సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 24న జరగబోయో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “ఆచార్య” నుంచి మరో ట్రైలర్ ను విడుదల చేయనున్నారట. ఆ ట్రైలర్ ఎమోషనల్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది.
Read Also : Beast Twitter Talk : మూవీ ఎలా ఉందంటే ?
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. “ఆచార్య” చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రీకొడుకులు చిరు, చరణ్ కలిసి కన్పించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, సౌరవ్ లోకేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్, సంగీత తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
