NTV Telugu Site icon

Shakuntalam: ఋషివనములో… శాకుంతల-దుష్యంత మహారాజుల ప్రేమ పుట్టింది

Shakuntalam

Shakuntalam

లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఎపిక్ ఫాంటసీ డ్రామా మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ఇప్పటికే శాకుంతలం మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సమంతా స్క్రీన్ ప్రెజెన్స్, గుణశేఖర్ టేకింగ్ శాకుంతలం ట్రైలర్ ని వర్త్ వాచింగ్ గా మార్చాయి. ఇటివలే ఈ మూవీ నుంచి ‘మల్లికా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది, తాజాగా శాకుంతలం సినిమా నుంచి “ఋషివనములోనా” అంటూ సాగే రెండో సాంగ్ ని జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాళిదాస్ రాసిన కథ ప్రకారం చూస్తే ఋషివనములోనే శకుంతల, దుష్యంతుడు పరిచయం అవుతారు. ఇక్కడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి, గాంధర్వ వివాహానికి దారి తీస్తుంది.

శకుంతల, దుష్యంతల ప్రేమని చూపించేలా ఈ సెకండ్ సాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సెకండ్ సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. దిల్ రాజు ప్రెజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడం గ్యారెంటి. ఆ తర్వాత టాక్ బాగుంటే లాంగ్ రన్ ఉంటుంది లేదంటే శాకుంతలం సినిమా కోసం చిత్ర యూనిట్ పడిన కష్టంలో అర్ధం లేకుండా పోతుంది. అయితే శాకుంతలం సినిమాకి ఒక మార్వెల్ మూవీ నుంచి మరో తెలుగు మాస్ సినిమా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

Show comments