Thug life : విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా, శింబు కీలక పాత్రలో నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వస్తున్న మూవీ. పైగా ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ మూవీని జూన్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. అందాల బ్యూటీ త్రిష ఇందులో హీరోయిన్ గా నటించగా.. ఈ సెకండ్ సింగిల్ ఆమె మీదనే చేశారు. రెహమాన్ మ్యూజిక్ అందించగా.. అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ వోకల్స్ సాంగ్ పాడారు. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం బాగుంది.
Read Also : Nambala Keshava Rao: బీటెక్ టు నక్సలిజం.. 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే!
ఇక సాంగ్ లో త్రిష అదిరిపోయే స్లిజీ చార్మ్ తో పాటు మరింత అందంగా కనిపిస్తోంది. త్రిషకు వయసు పెరుగుతున్నా సరే అందం తరగట్లేదని ఈ సాంగ్ ను చూస్తుంటే మరోసారి అర్థం అవుతోంది. రవికే చంద్రన్ అందించిన విజువల్ ఎఫెక్ట్ ఆకట్టుకుంటోంది. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీని తీస్తున్నారు. ఇందులో కమల్ హాసన్, శింబు మధ్య కీలక సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని శ్రేష్ట్ మూవీస్ అధినేత ఎన్.సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. మరి మూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Read Also : Tollywood: స్టార్ హీరో సినిమా షూటింగ్.. సరైన తిండి కూడా పెట్టలేదట
