NTV Telugu Site icon

Adipurush: జై శ్రీరామ్ సంచనలం మర్చిపోక ముందే “రామ్ సియా రామ్” రిలీజ్…

Adipurush

Adipurush

జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ చూడబోతున్న సెన్సేషన్ ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేసారు మేకర్స్. ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ కొడతాడు, మొదటి రోజు వంద కోట్లు రావడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆరు నెలల క్రితం భయంకరమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన ఈ మూవీ ఫేట్ ని మార్చేసింది ‘జై శ్రీరామ్’ సాంగ్. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ ఇంపాక్ట్ ని మర్చిపోక ముందే మరో సాంగ్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఇప్పటి వరకూ ఇండియాలో ఏ సినిమా పాటా విడుదల చేయని విధంగా, ఈ సెకండ్ సాంగ్ “రామ్ సియా రామ్” సాంగ్ లాంచ్ ని ప్లాన్ చేసారు. “రామ్ సియా రామ్” సాంగ్ ని ఈ నెల 29న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ఆదిపురుష్ చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ సాంగ్ ని సచేత్ – పరంపర కంపోజ్ చెయ్యడంతో పాటు వారే పాడడం విశేషం. జై శ్రీ రామ్ సాంగ్ ని అద్భుతమైన లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి “రామ్ సియా రామ్” సాంగ్ కి కూడా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

ఒక సెన్సేషనల్ గా ఉండబోతోన్న ఈ పాటని మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మే 29 మధ్యాహ్నం 12గంటలకు ఈ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు. సినిమాలకు సంబంధించి దేశ చరిత్రలోనే ఇదో సంచలనం కాబోతోంది. మే 29న మధ్యాహ్నం 12 గంటలకి దేశం మొత్తం ఒకేసారి “రామ్ సియా రామ్” పాటని వినబోతుందనమాట. ఇది నిజంగా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఈ సాంగ్ రిలీజ్ తో ఆదిపురుష్ పై అంచనాలు పీక్ స్టేజ్ ని వెళ్తాయి, వాటిని ఆకాశానికి తీసుకోని వెళ్తూ జూన్ 6న ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరగనుంది.

Show comments