NTV Telugu Site icon

Bholaa Shankar: మెగాస్టార్ జజ్జనక వేస్తే… థియేటర్స్ మోత మోగాల్సిందే

Bholaa Shankar

Bholaa Shankar

2023 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడేసిన మెగాస్టార్ చిరంజీవి, మరో నెలరోజుల్లో హిస్టరీ రిపీట్ చేయడానికి థియేటర్స్ లోకి భోళా శంకర్ గా వస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో నటిస్తోంది. తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్న భోలా శంకర్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి మెగా అభిమానుల్లో చిన్న భయం ఉండేది. మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ బాగోలేదు, చిరుతో సినిమా అంటే ఏం చేస్తాడో అని కంగారు పడేవారు. మెహర్ రమేష్ నెమ్మదిగా భోలా శంకర్ సినిమాపై అంచనాలు పెంచే పనిలో ఉన్నాడు. ఫాన్స్ కి మెగా మాస్ చూపిస్తే సినిమా హిట్ అనే విషయం మెహర్ కి బాగా తెలుసు అందుకే భోలా శంకర్ సినిమాని పర్ఫెక్ట్ గా క్రాఫ్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే వింటేజ్ చిరు వైబ్స్ ఇస్తూ భోళా శంకర్ సినిమా నుంచి టీజర్, భోళా మేనియా సాంగ్స్ బయటకి వచ్చి మెగా ఫాన్స్ కి కిక్ ఇచ్చాయి.

మెగా ఫాన్స్ మాత్రమే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా భోళా శంకర్ సినిమాలో చిరు చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఆగస్టు 11నే రిలీజ్ ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతూ భోళా శంకర్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. జామ్ జామ్ జజ్జనక అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోని ఈరోజు ఈవెనింగ్ రిలీజ్ చేసి, ఫుల్ సాంగ్ ని జులై 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో చిరు ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించాడు. పోస్టర్ డిజైన్ చేసిన విధానం చూస్తుంటే ఇది పెళ్లి సాంగ్ కానీ ఏదైనా సెలబ్రేషన్ కానీ అయి ఉండొచ్చు. ఇటీవలే చిరు లీక్స్ నుంచి కీర్తి సురేష్, తమన్నా లతో పాటు చిరు డాన్స్ చేస్తున్న ఒక ఆన్ లొకేషన్ వీడియో ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ఈ సాంగ్ లో సంబంధించినదే అయ్యే అవకాశం ఉంది. మరి ప్రోమో రిలీజ్ అయితే ఇది చిరు మాత్రమే కనిపించే పాటనా లేక కీర్తి సురేష్, తమన్నా కూడా ఉండే సెలబ్రేషన్ సాంగా అనేది చూడాలి.

Show comments