Site icon NTV Telugu

Ramabanam: పంచెకట్టిన మ్యాచో స్టార్ గోపీచంద్…

Ramabanam

Ramabanam

లక్ష్యం, లౌఖ్యం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీవాస్, గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మాస్ కాంబినేషన్ చేస్తున్న మూడో సినిమా ‘రామబాణం’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న రామబాణం సినిమాలో గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా, శ్రీవాస్ దర్శకత్వంలోనే ‘లక్ష్యం’ సినిమా రిలీజ్ అయ్యి సాలిడ్ హిట్ గా నిలిచింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లిమ్ప్స్ అండ్ ఐఫోన్ సాంగ్ రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి సెకండ్ సింగల్ రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ‘ధరువేయ్ రా’ అంటూ సాగే ఈ సాంగ్ ని సంబంధించిన పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

మిక్కీ జే మేయర్ మంచి మాస్ బీట్ సాంగ్ ఇచ్చినట్లు ఉన్నాడు, అందుకే గోపీచంద్ పంచే కట్టి మరీ డాన్స్ చేస్తున్నాడు. గోపీచంద్ తో పాటు పోస్టర్ లో హీరోయిన్ కూడా ఉంది, ఈ ఇద్దరూ పోస్టర్ లో చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. ఈ ‘ధరువేయ్ రా’ సాంగ్ ఏప్రిల్ 14న సాయంత్రం 5 గంటలకి కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో ఈవెంట్ చేసి మరీ లాంచ్ చెయ్యనున్నారు. ఈవెంట్ చేసి సాంగ్ రిలీజ్ చేస్తుండడంతో రామబాణం సినిమాకి మంచి బజ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి చాలా రోజుల తర్వాత గోపీచంద్ సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. ఇదే వైబ్ ని మేకర్స్ మే 5 వరకూ క్యారీ చేస్తూ ప్రమోషన్స్ చేసుకుంటే చాలు రామబాణం హిట్ అయినట్లే.

Exit mobile version