NTV Telugu Site icon

Adipurush: థియేటర్ లో హనుమంతుని సీటు ఎలా ఉందో చూడండి

Adipurush

Adipurush

Adipurush: ఈ ఒక్క రాత్రి ఆగితే చాలు ఉదయాన్నే ప్రభాస్ రాముడి దర్శనం అవుతుంది అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆయన రాముడిగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన అభిమానులు రేపటితో ఆ వెయిటింగ్ తీరిపోతుందని భావిస్తున్నారు. ఇక గతవారం నుంచి ఎక్కడ చూసిన ఆదిపురుష్ మేనియానే నడుస్తోంది. జై శ్రీరామ్ నినాదాల మధ్య రేపు థియేటర్ లో మోత మోగనుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా థియేటర్ లో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాముడు గురించి వినిపించిన ప్రతిచోట హనుమంతుడు తప్పకుండా ఉంటాడని నమ్మమని చెప్పుకొచ్చారు.

Arjun Leela : అర్జున్ లీల.. అసలు బొమ్మ చూస్తే ఆగలేరు అంతే

ఇక ఈ ఆ సీటు ఎలా ఉండబోతుంది అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ సీటుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆ సీటును కాషాయవస్త్రంతో కప్పి.. హనుమంతుని ఫోటోను పెట్టి.. జై శ్రీరామ్ అంటూ చైర్ పై రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇకపోతే రేపు థియేటర్ లో ఈ సీటుకు అభిమానులు పూజలు చేయనున్నారని తెలుస్తోంది. థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడు ముందుగా హనుమంతుడికి దండం పెట్టి.. సినిమా చూడాలని అభిమానులు చెప్పుకొస్తున్నారు.