Site icon NTV Telugu

Shiva Karthikeyan: మరో క్యాచీ సాంగ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న శివ కార్తికేయన్

Shiva Karthikeyan

Shiva Karthikeyan

కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మావీరన్’. ‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ‘మడోన్ అశ్విన్‌’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ లేదా జూలై నెలలో రిలీజ్ కి రెడీ అవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మావీరన్’ నుండి మొదటి సింగిల్ ఫిబ్రవరి 17న బయటకి రానుందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. తమిళ-తెలుగు భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘మావీరన్/మాహా వీరుడు’ సినిమా నుంచి ‘సీన్ సీన్’ అనే సాంగ్ ని రేపు రిలీజ్ చెయ్యనున్నారు. భరత్ శంకర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. శివ కార్తికేయన్ సినిమాలోని సాంగ్స్ చాలా క్యాచీగా, వినగానే హమ్ చేసే విధంగా ఉంటాయి. మావీరన్ సినిమాలోని ‘సీన్ సీన్’ సాంగ్ కూడా డ్రమ్స్ బీటుగా జోష్ ఫుల్ గానే స్టార్ట్ అయ్యింది.

మావీరన్ సినిమాలోని ఒక పాట కోసం శివకార్తికేయన్ 500 మంది కళాకారులతో కలిసి డాన్స్ చేసిన ఎపిసోడ్ ని షూట్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించడానికి మేకర్స్ మోకోబోట్ కెమెరాను ఉపయోగించారు. మరి అది ఈ ఫస్ట్ సాంగా లేక ఇంకో పాటనా అనేది తెలియాలి అంటే ‘సీన్ సీన్’ సాంగ్ బయటకి వచ్చే వరకూ ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన శివ కార్తికేయన్, లాస్ట్ మూవీ ‘ప్రిన్స్’తో భారి ఫ్లాప్ ని ఇచ్చాడు. బయ్యర్స్ ని బాగా నష్ట పరిచిన ఈ మూవీ ఇంపాక్ట్ పోవాలి అంటే శివ కార్తికేయన్ ‘మావీరన్’ సినిమాతో మస్ట్ అండ్ షుడ్ గా హిట్ కొట్టాలి. మరి శివ కార్తికేయన్, అశ్విన్ కలిసి ఏం చేస్తారో చూడాలి.

Read Also: Shiva Karthikeyan: యూనివర్సల్ గా అందరికీ నచ్చే సినిమా ‘ప్రిన్స్’

Exit mobile version